కరోనా(Corona) మళ్లీ ఇలా విరుచుకుపడుతుందని అసలు అనుకోలేదు. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌లోని కొత్త సబ్‌-వేరియంట్‌ జేఎన్‌.1(Corona JN1) కలకలం రేపుతోంది. భారత్‌లో ప్రవేశించిన ఈ వైరస్‌ మొదట కేరళలో వెలుగుచూసింది. తొలి కేసు అక్కడ నమోదయ్యింది.

కరోనా(Corona) మళ్లీ ఇలా విరుచుకుపడుతుందని అసలు అనుకోలేదు. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌లోని కొత్త సబ్‌-వేరియంట్‌ జేఎన్‌.1(Corona JN1) కలకలం రేపుతోంది. భారత్‌లో ప్రవేశించిన ఈ వైరస్‌ మొదట కేరళలో వెలుగుచూసింది. తొలి కేసు అక్కడ నమోదయ్యింది. తర్వాత గోవా, మహారాష్ట్రలతో పాటు చాలా రాష్ట్రాలలో విస్తరించింది. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలలో వైరస్‌(Virus) ప్రతాపం చూపుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Health Ministry) ఆదేశాలు జారీ చేసింది. వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. బూస్టర్‌ డోసు(Booster Dose) తీసుకుంటే కొంచెం భరోసాగా ఉండవచ్చు కదా అని భావిస్తున్నరు. అయితే ప్రస్తుతం బూస్టర్‌ డోసు, లేదా నాలుగో వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త సబ్‌-వేరియంట్‌లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని ఇండియా సార్స్‌- కోవ్‌-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్‌కే అరోరా తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు మాత్రమే ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని, అది కూడా ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోని వారు మాత్రమేనని డాక్టర్ అరోరా అన్నారు. సాధారణ ప్రజలకు ఇప్పుడు నాలుగో డోసు అవసరం లేదన్నారు. ఓమిక్రాన్‌లోని ఈ కొత్త సబ్-వేరియంట్‌కు సంబంధించిన కేసులు తీవ్రంగా లేవని, వైరస్‌ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని తెలిపారు. జ్వరం, ముక్కు కారటం, దగ్గు, కొన్నిసార్లు విరేచనాలు, తీవ్రమైన శరీర నొప్పులు జేఎన్‌.1 సబ్‌వేరియంట్ లక్షణాలని, సాధారణంగా ఇవి వారం రోజులలో తగ్గిపోతాయని తెలిపారు. ఇదిలా ఉంటే కోవిడ్‌-19 పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

Updated On 25 Dec 2023 12:29 PM GMT
Ehatv

Ehatv

Next Story