రాఖీ పండగను(Rakhi Festival) హిందువులు కొన్ని తరాల నుంచి చేసుకుంటునకనారు

రాఖీ పండగను(Rakhi Festival) హిందువులు కొన్ని తరాల నుంచి చేసుకుంటునకనారు. సాధారణ పత్తి నుంచి సిల్క్‌ దారం వరకు ఏ దారమైనా ఉపయోగంచి, పలురకాల డిజైన్లతో ఇప్పుడు రాఖీ లభిస్తోంది. అక్కాచెల్లెళ్లు రాఖీ పండగ ఎంత ఘనంగా చేసుకుంటారో మనకందరికీ తెలుసు. అక్కాచెల్లెళ్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది.చిన్నానాటి నుంచి తమతో పాటు పెరిగిన అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు ఆరాటపడుతుంటారు. నువ్వు చల్లగా ఉండాలని చెల్లి లేదా అక్క రాఖీ కడితే నీ కోసం నేనున్నా అంటూ భరోసానిచ్చేదే ఈ రాఖీ పండుగ. బ్రాహ్మణులు, గురువులు భక్తులకు శిష్యులకు ఒక బ్లెస్సింగ్ లాగా కట్టవచ్చు. చిన్న అమ్మాయిలు తండ్రికి కూడా రాఖీ కడతారు.

అయితే ఈ ఏడాది ఆగస్ట్ 19నన రాఖీ పండగ రాబోతుంది. జ్యోతిష్య శాస్త్రం(Horoscope) ప్రకారం ఉదయం 5:52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:32 వరకు భద్రకాలం ఉంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదని, ఒకవేళ ఈ సమయంలో రాఖీ కడితే అశుభమని పండితులు తెలుపుతున్నారు. ఈ కాలంలో రాఖీ కడితో సోదరులు ఏడాదంతా కష్టాలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. భద్ర అంటే అశుభమని ఉ.5.52 నుంచి మ.1.32 వరకు భద్రకాలం ఉన్నందున ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదని సూచిస్తున్నారు. పురాణాల ప్రకారం భద్రదేవత అంటే కృష్ణుడి ఏడో భార్యకు కొంత అరుదైన స్వభావం ఉండేదని, మరొకొన్ని పురాణాల ప్రకారం ఆమె జన్మించినప్పుడు విశ్వాన్నే మింగేస్తుందని, దీంతో శుభకార్యాల్లో ఆటంకాలు కలగే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ క్రమంలో రాఖీ కట్టేందుకు శుభ సమయాన్ని(Auspicious Time) కూడా సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1.32 తర్వాత సుముహూర్తం వస్తుందని, 1.32 నుంచి 4.21 వరకు శుభ సమయమని, సా.6.56 నుంచి రాత్రి 9.08 వరకు మంచి సమయమని చెప్తున్నారు. అంతేకాదు ఆగస్ట్ 19న యజ్ఞోపవితం, ఉపాకర్మ వంటి శుభకార్యాలు చేయొచ్చని వీటిపై భద్రకాలం ప్రభావితం చేయదంటున్నారు. ఈ కార్యక్రమాలు సూర్యోదయం తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. అయితే రాఖీ మాత్రం పైన సూచించిన శుభసమయాల్లో మాత్రమే కట్టాలని వేదపండితులు చెప్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story