తనకు తాను బాహుబలిగా చెప్పుకునే బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ సుద్దపూస ఏమీ కాదు. ఇతడు చేయని నేరం లేదు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలుఉన్నాయి. బాబ్రీ మసీదును కూల్చివేసిన సంఘటనలో ఈయనా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ లో నేర సామ్రాజ్యాన్ని ఏలుతున్న నాయకుడు. అన్నింటికీ మించి ఈయన భారతీయ జనతాపార్టీకి చెందిన లోక్‌సభ నాయకుడు! అందుకే ఇతడి జోలికి పోలీసులు కూడా వెళ్లరు.
తనకు తాను బాహుబలిగా చెప్పుకునే బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్(Brij Bhushan Sharan Singh) సుద్దపూస ఏమీ కాదు. ఇతడు చేయని నేరం లేదు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలుఉన్నాయి. బాబ్రీ మసీదును కూల్చివేసిన సంఘటనలో ఈయనా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో నేర సామ్రాజ్యాన్ని ఏలుతున్న నాయకుడు. అన్నింటికీ మించి ఈయన భారతీయ జనతాపార్టీకి చెందిన లోక్‌సభ నాయకుడు! అందుకే ఇతడి జోలికి పోలీసులు కూడా వెళ్లరు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు రోడ్డెక్కినా, నిరసనలు తెలిపినా, ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసులూ కేసు నమోదు చేసుకోలేదు. అందుకే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద బాహుబలి నేతల్లో బ్రిజ్‌భూషణ్ ఒకడు. ఆరుసార్లు ఎంపీగా గెలిచాడంటే ఇతడి బలమెంతో ఊహించుకోవచ్చు. ఇతడిపై బోలెడన్ని కేసులో ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తాడు. గెలుస్తాడు. రాజ్యంగ పదవులను చక్కగా అనుభవిస్తాడు.. ఇతడికి చాలా విద్యాసంస్థలు ఉన్నాయి. అఖాడాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ విధంగా యువతను అట్రాక్ట్ చేసుకోగలిగాడు. ఆరేడు జిల్లాలలో ఇతడి హవా ఉంది.
ఉత్తరప్రదేశ్ బిష్ణోపూర్ గ్రామంలో 1957లో జన్మించాడు బ్రిజ్‌భూషణ్. బిష్ణోపూర్ గ్రామం అయోధ్యకు చాలా దగ్గర. అక్కడ సాకేత్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. రాజకీయాలలో ఇతడికి అది తొలి మెట్టు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకోవడం మొదలు పెట్టాడు. ఆ విధంగా రెండు చేతులా సంపాదించసాగాడు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు రాజా ఆనంద్‌సింగ్‌తో పోటీపడ్డాడు. చెరకు సహకార సంఘం ఎన్నికల్లో రాజా ఆనంద్‌సింగ్‌కు వ్యతిరేకంగా నామినేషన్ వేశాడు. అప్పుడు జిల్లా ఎస్పీ బ్రిజ్ భూషణ్‌ను పిలిపించి నామినేషన్‌ను ఉపసంహరించుకోమని సూచించారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగాయి తన తుపాకీని ఎస్పీకి గురిపెట్టి బూతులు తిట్టాడు.
బ్రిజ్ భూషణ్‌కు దావూద్ ఇబ్రహీంతో కూడా సంబంధాలు ఉన్నాయి. 1992లో అరుణ్ గావ్లీ గ్యాంగుకు చెందిన శైలేష్ హల్డాంకర్‌ను కాల్చి చంపిన వారికి బ్రిజ్ భూషణే ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ముంబాయిలోని జేజే హాస్పిటల్ వార్డ్ నంబర్ 18లో ఉన్న శైలేష్‌ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే! దావూద్ సోదరుడి హత్యకు ప్రతీకారంగానే శైలేష్‌ను చంపినట్టు అనుమానాలున్నాయి. హంతకులకు బ్రిజ్‌భూషణ్ ఆశ్రయమిచ్చాడట. బాబ్రీ మసీదు కూల్చివేతలో కూడా ఇతడు పాల్గొన్నాడు. ఈ కేసులోని మొత్తం 49 నిందితులలో బ్రిజ్ భూషణ్ కూడా ఒకడు. ఈ విషయం సీబీఐ పేర్కొంది. అనంతరం ఈ రెండు కేసుల నుంచి చక్కగా బయటపడ్డాడు. దావూద్‌తో సంబంధాలున్నాయన్న కేసులో ఇతడిని టాడా చట్టం కింద అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న సమయంలో బీజేపీ నేత వాజ్‌పేయి 'ధైర్యం కోల్పోవద్దు. నిబ్బరంగా ఉండు' అని ఇతడికి లేఖ రాశారు. అదే సంవత్సరం, అంటే 1996 ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ భార్య కేతకి దేవికి బీజేపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. 1999లో గోండా లోక్‌సభ నుంచి పోటీ చేసిన బ్రిజ్ భూషణ్ అందులో విజయం సాధించాడు. ఆ టైమ్‌లోనే ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్‌తో గొడవ పడ్డాడు. గోండా నియోజకవర్గం పేరును జయప్రకాశ్ నగర్‌గా మార్చాలన్నది నానాజీ దేశ్‌ముఖ్ ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా బ్రిజ్‌భూషణ్ ఆందోళన చేపట్టాడు. ఇది కేంద్రంలోని బీజేపీకి నచ్చలేదు. అందుకే ఇతడిని బల్‌రాంపూర్ నియోజకవర్గానికి మార్చేసింది. దీంతో బ్రిజ్ భూషణ్ లోలోపల రగిలిపోయాడు. మరోవైపు గోండా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాజ్‌పేయి బంధువు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఘనశ్యామ్ శుక్లా పోటీ చేశాడు.
పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఓ రోడ్డు ప్రమాదంలో ఘనశ్యామ్ శుక్లా చనిపోయారు. ఇది ప్రమాదం కాదు, బ్రిజ్ భూషణ్ చేయించిన హత్య అన్న ఆరోపణలు చాలా వచ్చాయి. వాజ్‌పేయి కూడా బ్రిజ్‌భూషణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారట! ఇక బీజేపీలో ఉండటం వృధా అనుకున్న బ్రిజ్ భూషణ్ 2009లో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. చేరడంతోనే కైసర్‌గంజ్ లోక్‌సభ నుంచి విజయం సాధించాడు. తర్వాత మళ్లీ బీజేపీ గూటికి వచ్చేశాడు. 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున విజయం సాధించాడు. రాజకీయాలలో ఉన్నప్పుడే రెజ్లింగ్ సమాఖ్యపై దృష్టి పెట్టాడు. పెద్ద పెద్ద పోటీలను నిర్వహిస్తూ ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్‌లో చేరాడు. అటు పిమ్మట జాతీయ రెజ్లింగ్ సమాఖ్యలో చేరాడు. 2011లో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడయ్యాడు. ఇప్పటికీ మూడుసార్లు ఆ పదవిని చేపట్టాడు. అతడి ఫ్యామిలీ మెంబర్లనూ రెజ్లింగ్ సమాఖ్యలోకి తీసుకొచ్చాడు. బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ డబ్ల్యూఎఫ్‌ఐ వైస్ ప్రెసిడెంట్! మరో కొడుకు ప్రతీక్ ఏమో గోండా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అల్లుడేమో బీహార్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్. బ్రిజ్ భూషణ్ భార్య కేతకి జిల్లా పంచాయత్ అధ్యక్షురాలు. ఇంత పలుకుబడి, ఇంత బలగం ఉన్న బ్రిజ్‌భూషణ్‌ను పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అవతలి పార్టీలలో ఉన్న వారిని అమాంతం లేపేస్తున్న ముఖ్యమంత్రి యోగి తన పార్టీలో ఉన్న నేరస్తులపై మాత్రం చిన్నపాటి చర్య కూడా తీసుకోవడం లేదు.