పశ్చిమ బెంగాల్(West Bengal) మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(Ex-CM Buddhadev Bhattacharya) కూతురు సుచేతన భట్టాచార్య(Suchetana Bhattacharya) లింగ మర్పిడి(Gender change) చేయించుకోవాలనుకుంటున్నారు. పురుషుడిలా మారాలనుకుంటున్నట్టు ఆమె సంచనల ప్రకటన చేశారు.
పశ్చిమ బెంగాల్(West Bengal) మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(Ex-CM Buddhadeb Bhattacharya) కూతురు సుచేతన భట్టాచార్య(Suchetana Bhattacharya) లింగ మర్పిడి(Gender change) చేయించుకోవాలనుకుంటున్నారు. పురుషుడిలా మారాలనుకుంటున్నట్టు ఆమె సంచనల ప్రకటన చేశారు. ఈ మేరకు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఆమె న్యాయ సలహా(Law Advice) కూడా తీసుకున్నారట. ఈ ప్రక్రియకు అవసరమైన వివరాలను ఇప్పటికే తెలుసుకున్నారట. ఇందుకు సంబంధించిన డ్యాకుమెంట్ల కోసం డాక్టర్లను సంప్రదించడం కూడా అయిపోయిందట! ఇక శస్త్రచికిత్స జరగడమే తరువాయి! ఇటీవల ఎల్‌జీబీటీక్యూ వర్క్‌షాపుకు(LGBTQ workshop) హాజరైన సుచేతన ఈ విషయాన్ని చెప్పారు.
తతను తాను మగవాడిగా గుర్తించానని, శారీరకంగా కూడా అలాగే ఉడాలనుకుంటున్నానని చెప్పారు. ' నా తల్లిదండ్రుల గుర్తింపు, కుటుంబ గుర్తింపు పెద్ద విషయం కాదు. నా ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంలో బగంగా నేను దీన్ని చేస్తున్నాను. ట్రాన్స్‌మాన్‌గా నేను నిత్యం ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులకు ముగింపుపలకాలనుకుంటున్నాను. ఇప్పుడు నాయ వయసు 41 ఏళ్లు. నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు నేనే తీసుకోగలను. అదే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి తీసుకురాకండి. అవసరమైతే దీని కోసం పోరాటం చేస్తాను. నాకా ధైర్యం ఉంది. ఎవరూ ఏం చెప్పినా పట్టించుకోను' అని సుచేతన భట్టాచార్య తెలిపారు. అలాగే ఈ వార్తను వక్రీకరించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. తండ్రి బుద్ధదేవ్ భట్టాచార్య తనకు మద్దతుగా నిలుస్తారనే నమ్మకం ఉందని సుచేతన అన్నారు.