ఒడిశా రైలు ప్రమాదంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘోర ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్నారు మమతా బెనర్జీ. దీనిపై కేంద్ర ప్రభుత్వమే సత్వరమే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Mamatha Banerjee
ఒడిశా రైలు ప్రమాదంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘోర ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్నారు మమతా బెనర్జీ. దీనిపై కేంద్ర ప్రభుత్వమే సత్వరమే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇది రాజకీయాలు(politics) చేసే సమయం కాదని, ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయమని మమతా బెనర్జీ అన్నారు. ఘటన స్థలానికి వెళ్లిన మమత పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేట్టుగా చూడాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
