చాలా సందర్భాలలో బెంగాల్(Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీని(Mamatha Banerjee) చూస్తే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంటుంది. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్న అహం ఆమెలో ఇసుమంతైనా కనిపించదు. చాలా సాదాసీదాగా, కాటన్ సారీతో(Cotton saree), హవాయి చెప్పులతో ఉంటారు.
చాలా సందర్భాలలో బెంగాల్(Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీని(Mamatha Banerjee) చూస్తే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంటుంది. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్న అహం ఆమెలో ఇసుమంతైనా కనిపించదు. చాలా సాదాసీదాగా, కాటన్ సారీతో(Cotton saree), హవాయి చెప్పులతో ఉంటారు. ఇప్పుడు ఆమె తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. ఢిల్లీలో నిరసన చేపడుతున్న అగ్రశ్రేణి రెజ్లర్లకు(wrestlers) సంఘీభావంగా మొన్న గురువారం కోల్‌కతాలో ఓ క్యాండిల్ ర్యాలీని(Candle rally) నిర్వహించారు. దీనికి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఈ ర్యాలీలో అనారోగ్యంతో కిందపడిన ఫొటో జర్నలిస్ట్(journalist) సుభ్రాంశుకు ఆమె నీళ్ల బాటిలు అందించారు. తన కారులోనే హాస్పిటల్‌కు పంపారు. ర్యాలీ ముగిశాక సెక్యూరిటీ బైక్ వెనుక కూర్చొని వెళ్లిపోయారు. అనంతరం సుభ్రాంశును పరామర్శించేందుకు ఆసుపత్రికి కూడా వెళ్లారు. దటీజ్ మమత