సార్వత్రిక ఎన్నిక(General Elections) సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని(West bengal) భారతీయ జనతాపార్టీకి(BJP) పెద్ద షాకే తగిలింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకురాలు సిరియా పర్విన్(Syria Parveen) ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో(Trinamool congress) చేరారు. తను బీజేపీకి ఎందుకు రాజీనామా(Resign) చేయాల్సి వచ్చిందో చెప్పారు.
సార్వత్రిక ఎన్నిక(General Elections) సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని(West bengal) భారతీయ జనతాపార్టీకి(BJP) పెద్ద షాకే తగిలింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకురాలు సిరియా పర్విన్(Syria Parveen) ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో(Trinamool congress) చేరారు. తను బీజేపీకి ఎందుకు రాజీనామా(Resign) చేయాల్సి వచ్చిందో చెప్పారు. బెంగాల్‌లో సందేశ్‌ఖాళీ సంఘటన అంతా బీజేపీ నేతల ప్లాన్ ప్రకారమే జరిగిందని, అది ఓ పొలిటికల్ డ్రామా అని సిరియా పర్విన్ చెప్పారు. సందేశ్‌ఖాళీలో మహిళలతో మాట్లాడేందుకు బీజేపీ నేతలు వేర్వేరు సిమ్ కార్డ్స్, ఫోన్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే రేఖా పాత్రకు బీజేపీ నేతలు డబ్బులు ఇచ్చి నాటకాన్ని నడిపారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, త్వరలో వీటిని బయటపెడతానని సిరియా పర్విన్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎలాంటి తప్పు చేయకపోయినా వారిపై అసత్యాలను ప్రచారం చేస్తున్నదని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని తెలిపారు. అందుకే తాను బీజేపీని వదిలిపెట్టి టీఎంసీలో చేరానని చెప్పారు.