దేశమంతటా ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి జనం బెంబేలెత్తున్నారు. వడగాల్పుల(Heatwaves) దెబ్బకు జనం కళ్లు తేలేస్తున్నారు. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల మూడు నాలుగు రోజులు ఇంతకంటే భయకరంగా ఎండలు ఉంటాయని భారత వాతావరణ కేంద్రం( India Meteorological Centre)హెచ్చరించింది. మరోవైపు తొమ్మిది రాష్ట్రాలలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని తెలిపింది.

Weather Forecast
దేశమంతటా ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి జనం బెంబేలెత్తున్నారు. వడగాల్పుల(Heatwaves) దెబ్బకు జనం కళ్లు తేలేస్తున్నారు. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల మూడు నాలుగు రోజులు ఇంతకంటే భయకరంగా ఎండలు ఉంటాయని భారత వాతావరణ కేంద్రం( India Meteorological Centre)హెచ్చరించింది. మరోవైపు తొమ్మిది రాష్ట్రాలలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని తెలిపింది. దక్షిణ ఉత్తరప్రదేశ్(Uttar pradesh), పశ్చిమ రాజస్థాన్(Rajasthan), ఉత్తర మధ్యప్రదేశ్(Madhya pradesh), చత్తీస్‌గఢ్(Chhattisgarh), తూర్పు జార్ఖండ్(Jharkhand) ప్రాంతాలలో ఎండలు తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ రోజు, రేపు 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కేరళ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
