వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా ? లేక కరువు కాటకాలు వస్తాయా? అన్నది వాతావరణశాఖ ముందే మనకు హెచ్చరికతో కూడిన సూచన చేస్తుంది. ఈ మాత్రం మేమూ తెలుసుకోగలం అంటారు భితర్‌గావ్‌ బెహతా గ్రామస్తులు. ఎలా తెలుసుకుంటారన్నది తెలుసుకునే ముందు అసలు ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలిగా! ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా ఘతంపూర్‌ ప్రాంతంలో ఉందీ ఊరు. ఇక్కడ వందేళ్ల నాటి జగన్నాథుని ఆలయం ఒకటుంది.. రుతుపవనాల గురించి ఈ ఆలయం ముందే చెబుతుందట! ఆలయం పై కప్పు అంటే సీలింగ్‌ నుంచి రాలే నీటి బొట్టు పరిమాణాన్ని బట్టి వర్షాలు సమృద్ధిగా పడతాయా? లేక కరువు ఏర్పడుతుందా అన్నది తెలిసిపోతుందని చెబుతారు స్థానికులు

మాన్‌సూన్‌ (Mansoon) సీజన్‌ వచ్చేసింది. నైరుతీ రుతుపవనాలు మనల్ని పలకరించడం కూడా అయ్యింది. ఈసారి వర్షపాతం ఎలా ఉండబోతున్నది ? వానలు సమృద్ధిగా కురుస్తాయా ? పంటలకు ఢోకా ఏమి ఉండదు కదా..? సహజంగా తలెత్తే ఇలాంటి ప్రశ్నలకు వాతావరణశాఖ వివరణాత్మక సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఇలాంటి సందేహాలకు ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామస్తులు మాత్రం ఓ గుడి సాయం తీసుకుంటారు.? ఏమిటా గుడి విశేషం? ఫోర్‌క్యాస్ట్‌ను ఎలా చెబుతుంది.?

వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా ? లేక కరువు కాటకాలు వస్తాయా? అన్నది వాతావరణశాఖ ముందే మనకు హెచ్చరికతో కూడిన సూచన చేస్తుంది. ఈ మాత్రం మేమూ తెలుసుకోగలం అంటారు భితర్‌గావ్‌ బెహతా గ్రామస్తులు. ఎలా తెలుసుకుంటారన్నది తెలుసుకునే ముందు అసలు ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలిగా! ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా ఘతంపూర్‌ ప్రాంతంలో ఉందీ ఊరు. ఇక్కడ వందేళ్ల నాటి జగన్నాథుని ఆలయం ఒకటుంది.. రుతుపవనాల గురించి ఈ ఆలయం ముందే చెబుతుందట! ఆలయం పై కప్పు అంటే సీలింగ్‌ నుంచి రాలే నీటి బొట్టు పరిమాణాన్ని బట్టి వర్షాలు సమృద్ధిగా పడతాయా? లేక కరువు ఏర్పడుతుందా అన్నది తెలిసిపోతుందని చెబుతారు స్థానికులు

జగన్నాథుడు కొలువై ఉన్న ఈ ఆలయం వాన గుడిగా ప్రసిద్ధిగాంచింది.. పైకప్పు నుంచి రాలే నీటి బిందువు పెద్దగా ఉంటే వానలు బాగా పడతాయని.. అదే చిన్నగా ఉంటే కరువు వస్తుందనేది స్థానికుల బలమైన నమ్మకం. అసలు ఆలయం సీలింగ్‌ నుంచి నీటి బిందువులు ఎలా పడుతున్నాయన్న దానిపై బోలెడంత పరిశోధన జరిగింది.. ఇప్పటికీ పరిశోధకులు ఓ నిర్ధారణకు రాలేకపోయారు. గుడి నిర్మాణమే అద్భుతం.. ప్రతి ఏడాది వర్షాల కోసం రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తారు.. సీలింగ్‌లోని బండరాళ్లలో పేరుకుపోయిన నీటి బిందువులను ఆసక్తిగా చూస్తారు.. జులై మాసంలో ఇక్కడ జగన్నాథ రథోత్సవాలు జరుగుతాయి.. ఇక కృష్ణాష్టమి గురించి చెప్పనే అక్కర్లేదు.. పెద్ద జాతరే జరుగుతుంది..

Updated On 3 July 2023 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story