దేశ రాజధాని ఢిల్లీ(delhi) మహానగరంలో గుక్కెడు నీళ్లు(Water) దొరకడం కష్టంగా మారింది.

దేశ రాజధాని ఢిల్లీ(delhi) మహానగరంలో గుక్కెడు నీళ్లు(Water) దొరకడం కష్టంగా మారింది. రాజకీయ పార్టీల రాజకీయాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీకి సరిపడా నీళ్లను హర్యానాలోని(Haryana) బీజేపీ(BJP) ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆప్‌ అంటోంది. ఇందుకోసం మంత్రి ఆతిషి నిరవధిక నిరాహారదీక్షకు కూడా దిగారు. అబ్బే నీటి సంక్షోభానికి ఆప్‌ ప్రభుత్వమే కారణమని బీజేపీ చెబుతోంది. ఢిల్లీలోని ఓక్లాలోని జల్ బోర్డు కార్యాలయం ముందు నిరసనకు దిగారు ఆ పార్టీ నాయకులు. చిత్రమేమిటంటే వీరిని చెల్లాచెదురు చేయడానికి పోలీసులు వాటర్‌ క్యానన్‌లను ప్రయోగించడం! నీటి కొరతతో జనం అల్లాడిపోతుంటే నీళ్లతోనే నిరసనకారులను చెదరగొట్టడమా అని పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఢిల్లీలో భయంకర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రిజర్వాయర్‌లలో నీటినిల్వలు తగ్గాయి. యమునా నదిలోనూ నీటి లభ్యత తక్కువైంది. దీనికి తోడు కొన్ని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ప్రజలు నీటి ట్యాంకర్ల దగ్గర పెద్ద యుద్ధమే చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story