కర్ణాటక శాసనసభలో 224 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. ఓటు వేయాలని ప్రధాని మోదీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అన్నిస్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాల్లో 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలలో ఓటర్లు 2,615 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారు.

Voting under way in high-stakes battle seen as 2024 poll warm-up
కర్ణాటక(Karnataka) శాసనసభలో 224 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. ఓటు వేయాలని ప్రధాని మోదీ(Narendra Modi) ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అన్నిస్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాల్లో 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలలో ఓటర్లు 2,615 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారు.
ఓటర్లలో పురుషులు(Men) 2,67,28,053, మహిళలు(Woman) 2,64,00,074, ఇతరులు 4,927 మంది ఉన్నారు. అభ్యర్థుల్లో 2,430 మంది పురుషులు, 184 మంది మహిళలు, ఒక టాన్స్‌జెండర్ అభ్యర్థి ఉన్నారు. రాష్ట్రంలో 11,71,558 మంది యువ ఓటర్లు(Youth Voters) ఉండగా, 5,71,281 మంది శారీరక వికలాంగులు, 12,15,920 మంది 80 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
రచయిత్రి సుధా మూర్తి(Sudha Murthy) బెంగళూరులోని జయనగర్‌లో ఓటు వేశారు. ఆమె ఓటు వేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన భాగం, ఓటర్లు లేని ప్రజాస్వామ్యం అస్సలు ప్రజాస్వామ్యం కాదు, కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థింంచారు.
ప్రధాని మోదీ(Narendra Modi) మాయాజాలం మనకు పూర్తి మెజారిటీ ఇస్తుందని బీజేపీ నేత బీవై విజయేంద్ర(Vijayendra) అన్నారు. ఈ ఎన్నికల్లో కనీసం 130 సీట్లు గెలుస్తాం. లింగాయత్(Lingayath) వర్గాలే కాదు, ఇతర కులాల వారు కూడా బీజేపీ(BJP) వెంటే ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) ఘోరంగా ఓడిపోతుందన్నారు.
కర్ణాటక ఎన్నికల సందర్భంగా బజరంగ్ దళ్(Bajarandal)-బజరంగ్ బలి వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) స్పందించారు. మనం నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తాం, బజరంగ్ బలిని పూజిస్తాం, అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అలాంటిది పేర్కొనడం మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. రానున్న రోజుల్లో బెంగళూరు మౌలిక సదుపాయాలు మెరుగుపడాలని ఓటింగ్ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కర్ణాటకలో పరిశ్రమలు మరింత ఊపందుకున్నాయి. నేను డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఓటు వేశానన్నారు.
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ఓటు వేయాలని ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను. వాళ్లు బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారని నాకు 100% నమ్మకం ఉంది. 75-80 శాతం కంటే ఎక్కువ మంది బిజెపికి మద్దతు ఇస్తారు. మేము 130-135 సీట్లు గెలుచుకుంటామన్నారు.
