కట్టుదిట్టమైన భద్రత, ఏర్పాట్ల మధ్య ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు

కట్టుదిట్టమైన భద్రత, ఏర్పాట్ల మధ్య ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు)లలో 58 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఆరవ దశకు శనివారం ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ముగింపు సమయానికి లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఉంది.

ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో ఎనిమిది సీట్లు, హర్యానాలో మొత్తం 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్‌లో ఒక సీటు, జార్ఖండ్‌లో నాలుగు, ఢిల్లీలో మొత్తం ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది సీట్లు ఉన్నాయి. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలోని నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీ, హర్యానాలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Updated On 24 May 2024 9:49 PM GMT
Yagnik

Yagnik

Next Story