ఉత్తరప్రదేశ్‌లో(Utter pradesh) జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ విశేషం చోటు చేసుకుంది. బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి మరణించారన్న విషయం తెలిసి కూడా ఓటర్లు(Voters) ఆమెనే ఎన్నుకున్నారు. ఆమె మంచితనమే ఆమెను ఎన్నుకునేలా చేసింది. చనిపోయినా ఓటర్ల గుండెల్లో ఆమె నిలిచింది.
ఉత్తరప్రదేశ్‌లో(Utter pradesh) జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ విశేషం చోటు చేసుకుంది. బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి మరణించారన్న విషయం తెలిసి కూడా ఓటర్లు(Voters) ఆమెనే ఎన్నుకున్నారు. ఆమె మంచితనమే ఆమెను ఎన్నుకునేలా చేసింది. చనిపోయినా ఓటర్ల గుండెల్లో ఆమె నిలిచింది. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హసన్‌పూర్ మున్సిపాలిటీలోని ఏడోవార్డు మహిళలకు రిజర్వ్ చేశారు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో ఆసియా అనే యువతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.
ఏప్రిల్ 16న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన తర్వాత ఆమె ఆరోగ్యం కాసింత దెబ్బతిన్నది. ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు పరీక్షలు చేసి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకిందన్నారు. చికిత్స చేస్తే నయం కావచ్చన్నారు. డాక్టర్లు చాలా ప్రయత్నించారు కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ ఏప్రిల్ 20వ తేదీన ఆమె చనిపోయారు. ఆసియా మృతి చెందినప్పటికీ ఓటర్లు మాత్రం ఆమెను గెలిపించారు. ఈ విజయంపై ఆసియా భర్త ముంతజీబ్ అహ్మద్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఆసియా గత ఎన్నికల్లో పోటీ చేయలేదని, ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుందని ఆయన చెప్పారు. ఆమె నడవడిక, ప్రవర్తనలతో ప్రజల మనసును గెల్చుకోగలిందని, ఆమెపట్ల ప్రజలకు ఉన్న ప్రేమ ఎంతటితో ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయని చెమ్మగిల్లిన కళ్లతో ముందజీబ్ అహ్మద్ తెలిపారు. 'ఆసియా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు, నామినేషన్ వేసిన కొన్ని రోజులకే అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఎన్నికలలో ఆమె గెలుపొందారు. ఇప్పుడు మళ్లీ ఆ వార్డులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది' అని హసన్‌పూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తెలిపారు.