రష్యాలో భారీ భూకంపం సంభ‌వించింది. కమ్‌చట్కా ప్రాంతంలోని తూర్పు తీరంలో 51 కి.మీ లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది

రష్యాలో భారీ భూకంపం సంభ‌వించింది. కమ్‌చట్కా ప్రాంతంలోని తూర్పు తీరంలో 51 కి.మీ లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. కమ్‌చట్కా ప్రాంతంలోని సివాలుచ్ అగ్నిపర్వతం ఉన్న‌ దేశ తూర్పు తీరంలో రిక్ట‌ర్ స్కేలు 7 తీవ్రతతో భూకంపం సంభవించిందని స్థానిక మీడియా ఆదివారం నివేదించింది.

భూకంపం ధాటికి అగ్నిపర్వతం బూడిద, లావాను వెదజల్లడం ప్రారంభించిందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఫార్ ఈస్టర్న్ బ్రాంచ్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సీస్మోలజీని ఉదహరిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని TASS వార్తా సంస్థ పేర్కొంది. శివలుచ్ అగ్నిపర్వతం విస్ఫోటనం ప్రారంభమైందని.. దృశ్యాల‌ను బ‌ట్టి వేసిన అంచ‌నా ప్ర‌కారం.. బూడిద ప్లూమ్ సముద్ర మట్టానికి ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వ‌ర‌కూ వ్యాపించాయని శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఉందని గతంలో అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అయితే సునామీ వచ్చే ప్రమాదం లేదని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ, కమ్‌చట్కా శాఖ తెలిపింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story