దానంతట అదే వచ్చి భారత భూభాగంలో కలిసిపోతుందని అంటున్నారు కేంద్ర మంత్రి, మాజీ ఆర్బీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌. కాకపోతే దానికోసం కొంతకాలం ఎదురుచూడాల్సి ఉంటుందన్నారు. పరివర్తన సంకల్ప యాత్రలో భాగంగా దౌసాలో(Dausa) జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో(press conference) వీకే సింగ్‌(VK Singh) ఈ మాటన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని షియా ముస్లింలు బోర్డర్‌ గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

పాకిస్తాన్‌(Pakistan) ఆక్రమిత కశ్మీర్‌(Kashmir) కోసం మనం పెద్దగా శ్రమించాల్సిన పని లేదని, దానంతట అదే వచ్చి భారత భూభాగంలో కలిసిపోతుందని అంటున్నారు కేంద్ర మంత్రి, మాజీ ఆర్బీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌. కాకపోతే దానికోసం కొంతకాలం ఎదురుచూడాల్సి ఉంటుందన్నారు. పరివర్తన సంకల్ప యాత్రలో భాగంగా దౌసాలో(Dausa) జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో(press conference) వీకే సింగ్‌(VK Singh) ఈ మాటన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని షియా ముస్లింలు బోర్డర్‌ గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ఆ భూభాగం దానంతట అదే వచ్చి భారత్‌లో కలిసిపోతుందని వీకే సింగ్‌ అన్నారు. జీ 20 సమావేశాలు(G20 meet) విజయవంతమయ్యాయని, ఈ క్రెడిట్‌ కచ్చితంగా ప్రధాని నరేంద్రమోదీకే(Narendra Modi) దక్కుతుందని వీకే సింగ్‌ పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇవే సమావేశాలను చాలా దేశాలు నిర్వహించాయని, భారత్‌ మాత్రం మరింత ఘనంగా నిర్వహించి అంతర్జాతీయ వేదికపై భారత్‌ సత్తా ఏమిటో నిరూపించుకుందని చెప్పారు. పనిలో పనిగా రాజస్థాన్‌ రాజకీయాల గురించి కూడా సింగ్‌ మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అందుకే బీజేపీ ప్రతిష్టాత్మక పరివర్తన యాత్రను ప్రారంభించిందని చెప్పారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, యాత్ర సమయంలో స్వయంగా వారే వచ్చి ఈ విషయం చెబుతున్నారని వీకే సింగ్‌ తెలిపారు. మఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ సంప్రదాయం కాదని, ప్రధాని మోదీ ఛరిష్మాతోనే ఎన్నికలకు వెళతామని వీకే సింగ్‌ తెలిపారు.

Updated On 12 Sep 2023 2:58 AM GMT
Ehatv

Ehatv

Next Story