మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో(Lok sabha Elections) అన్నాడీఎంకే(Anna DMK) పేవలమైన ప్రదర్శనను కనబర్చింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది.

మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో(Lok sabha Elections) అన్నాడీఎంకే(Anna DMK) పేవలమైన ప్రదర్శనను కనబర్చింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. ఇలాంటి సమయంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత (Jayalaitha)నెచ్చెలి వి.కె.శశికళ(VK sashikala) తెరమీదకు వచ్చారు. అన్నాడీఎంకే పార్టీలో తన పునఃప్రవేశానికి సమయం ఆసన్నమయ్యిందంటూ ఓ కీలక ప్రకటన చేశారు. పార్టీలో తన రీ ఎంట్రీ మొదలయ్యిందన్నారు. లోక్‌సభ ఎన్నికలలో దారుణ పరాజయంతో అన్నాడీఎంకే పని అయిపోయిందని, ఆ పార్టీ పతనమవుతుందని అనుకోవాల్సిన పని లేదని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలిచి అమ్మ జయలలిత పాలనకు శ్రీకారం చుడతామని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఎడప్పాడి కె.పళనిస్వామి విఫలమవుతున్నారని , ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు అడగడం లేదని శశికళ వ్యాఖ్యానించారు. ఇక నుంచి ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తానని చెప్పారు.‘నేను మీకు చెబుతున్నా. టైమొచ్చింది. ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. తమిళనాడు ప్రజలు కచ్చితంగా మావైపే ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను. అన్నాడీఎంకే కథ ముగిసిందని అనుకోవద్దు. పార్టీలో నా రీ ఎంట్రీ ప్రారంభమైంది’ అని తన మద్దుతుదారులతో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు శశికళ. కార్యకర్తల పార్టీ అన్నాడీఎంకే అని, ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్‌, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని తెలిపారు. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీలో కుల రాజకీయాలను ప్రోత్సహించడాన్ని పార్టీ కార్యకర్తలు సహించరనన్నారు. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారే కాదని శశికళ అన్నారు అందరినీ ఏకం చేసి అన్నాడీఎంకే పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని, ఇందుకోసం తన ప్రయత్నం మొదలు పెట్టానని వి.కె.శశికళ చెప్పుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story