స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వీవో(Vivo) సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. తమ కస్టమర్లకు(Customers) వినూత్న పిలుపునిచ్చింది. డిసెంబర్ 20న వివో వాడుతున్న కస్టమర్లందరూ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు సెల్‌ఫోన్లు(Cell phones) స్విచాఫ్ చేసి ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని కోరింది. పిల్లలు ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడుపుతున్నారని.. ఇది వారి భవిష్యత్‌కు(Future) ప్రమాదమని పలు నివేదికలు చెప్పడంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టామని వీవో తెలిపింది.
స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వీవో(Vivo) సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. తమ కస్టమర్లకు(Customers) వినూత్న పిలుపునిచ్చింది. డిసెంబర్ 20న వివో వాడుతున్న కస్టమర్లందరూ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు సెల్‌ఫోన్లు(Cell phones) స్విచాఫ్ చేసి ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని కోరింది. పిల్లలు ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడుపుతున్నారని.. ఇది వారి భవిష్యత్‌కు(Future) ప్రమాదమని పలు నివేదికలు చెప్పడంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టామని వీవో తెలిపింది. దీనికి ' స్విచాఫ్'(Switchoff) అనే పేరు పెట్టింది. పలు సర్వేల ప్రకారం 12 ఏళ్లలోపు బాలబాలికల్లో 42 శాతం మంది రోజుకు 2-4 గంటలపాటు ఫోన్‌లో గడుపుతున్నారని చెప్పారు. 12 ఏళ్లకుపైగా వయసున్న పిల్లలు దాదాపు 47 శాతం సమయం ఫోన్లకే డెడికేట్(Dedicate) చేస్తున్నారని సర్వేలు వెల్డించాయి. 69 శాతం మంది టీనేజర్లకు(Teenagers) ఫోన్లు, ట్యాబ్‌లు ఉన్నాయని.. యూట్యూబ్(Youtube), గేమింగ్ కోసం అధిక సమయం ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలు తెలిపాయి. ఈ సర్వేలను(Survey) చూసి తాము సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టామని.. ' స్విచాఫ్' పేరుతో ఈనెల 20న రాత్రి ఒక గంటపాటు ఫోన్లన్నీ బంద్ చేసి తల్లిదండ్రులతో పిల్లలు హాయిగా గడపాలని వీవో కోరింది