అమెరికాలో(America) భారతీయులపై(Indian) దాడులు ఆగడం లేదు. కొందరు దుండగులు కావాలని భారతీయులను దారుణంగా హత్యలు(Murder) చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి 25 ఏళ్ల భారతీయ విద్యార్థిపై సుత్తితో దాడికి పాల్పడ్డారు. డికాల్బ్ కౌంటీ పోలీసుల ప్రకారం అమెరికాలోని జార్జియాలోని(Georgia) ఓ స్టోర్‌లో వివేక్ సైనీ(Vivek saini) అనే 25 ఏళ్ల భారతీయ విద్యార్థి పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. సైనీని కొందరు షాపు నుంచి బయటకు రమ్మని పిలిచారు.

అమెరికాలో(America) భారతీయులపై(Indian) దాడులు ఆగడం లేదు. కొందరు దుండగులు కావాలని భారతీయులను దారుణంగా హత్యలు(Murder) చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి 25 ఏళ్ల భారతీయ విద్యార్థిపై సుత్తితో దాడికి పాల్పడ్డారు. డికాల్బ్ కౌంటీ పోలీసుల ప్రకారం అమెరికాలోని జార్జియాలోని(Georgia) ఓ స్టోర్‌లో వివేక్ సైనీ(Vivek saini) అనే 25 ఏళ్ల భారతీయ విద్యార్థి పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. సైనీని కొందరు షాపు నుంచి బయటకు రమ్మని పిలిచారు. ఆ తర్వాత మాట్లాడుతూ, మాట్లాడుతూ ఒక్కసారిగా సుత్తితో దారుణంగా కొట్టి దాడిచేశారు. ఈ క్రమంలో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. జనవరి 16న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఫాల్క్‌నర్ అతనిపై సుత్తితో దాడి చేసి 'తలపై ముఖంపై దాదాపు 50 సార్లు కొట్టాడు. 'తీవ్రమైన గాయాలతో అపస్మారక స్థితిలోకి పోయి సంఘటనా స్థలంలో మరణించినట్లు తెలుస్తోంది. లిథోనియాలోని చెవ్రాన్ గ్యాస్ స్టేషన్‌లో దాడి గురించి 12:30 గంటలకు అధికారులకు కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు కత్తులు, మరొక సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రెండేళ్ల కింద అమెరికాకు వెళ్లిన ఇటీవల బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ సాధించాడు. పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్న విద్యార్థి ఫాల్క్‌నర్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య పట్ల భారత ఎంబసీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Updated On 29 Jan 2024 6:32 AM GMT
Ehatv

Ehatv

Next Story