ఇవాళ కొన్ని రాష్ట్రాల ప్రజలు సంవత్సరారంభాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రేపు ఇంకొన్ని రాష్ట్రాలవారు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోబోతున్నారు. మలయాళీలకు శనివారం కొత్త సంవత్సర పర్వదినం రాబోతున్నది. ఈ పండుగను విషు (Vishu)అంటారు. మేష సంక్రాంతి రోజున విషు వస్తుంది. సూర్య గమనాన్ని అనుసరించి ఏడాదిలో రెండు రోజులు పూర్తి భిన్నంగా ఉంటాయి. జూన్‌ 21న రాత్రి కంటే పగలు ఎక్కువ సమయం ఉంటుంది. అలాగే డిసెంబర్‌ 21న పగటి కంటే రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. వీటిని విషవత్తులు అంటారు. మొదటిది ఉత్తరాయణంలో వస్తుంది. రెండోది దక్షిణాయనంలో వస్తుంది.

ఇవాళ కొన్ని రాష్ట్రాల ప్రజలు సంవత్సరారంభాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రేపు ఇంకొన్ని రాష్ట్రాలవారు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోబోతున్నారు. మలయాళీలకు శనివారం కొత్త సంవత్సర పర్వదినం రాబోతున్నది. ఈ పండుగను విషు (Vishu)అంటారు. మేష సంక్రాంతి రోజున విషు వస్తుంది.

సూర్య గమనాన్ని అనుసరించి ఏడాదిలో రెండు రోజులు పూర్తి భిన్నంగా ఉంటాయి. జూన్‌ 21న రాత్రి కంటే పగలు ఎక్కువ సమయం ఉంటుంది. అలాగే డిసెంబర్‌ 21న పగటి కంటే రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. వీటిని విషవత్తులు అంటారు. మొదటిది ఉత్తరాయణంలో వస్తుంది. రెండోది దక్షిణాయనంలో వస్తుంది. అలాగే ఏడాదిలో రెండు రోజులు సూర్యుడు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉదయిస్తాడు. వాటిని తుల విషు. మేడ విషు అంటారు.. ఏప్రిల్‌లో వచ్చే మేడ విషు రోజునే మలయాళీలు కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు.

విషు అంటే సమానమని అర్థం.అందుకే ఈ పండుగను కులమతాలకు అతీతంగా, పేద ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకుంటారు. మలబారు ప్రాంతంలో అయితే మరింత శోభాయమానంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. కొత్త ఏడాది మంచిని తెస్తుందని, సుఖశాంతులు ఇస్తుందని ఆకాంక్షిస్తారు మలయాళీలు! మలయాళీలు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నారు. రావణబ్రహ్మ నవగ్రహాలను, అష్టదిక్పాలకులను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడంతో సూర్యుడు గమనం తప్పుతాడు. ఎప్పుడైతే రావణ సంహారం జరిగిందో ఆ మరుసటి రోజున సూర్యుడు తన పూర్తి శక్తితో తూర్పు నుంచి నిటారుగా ఉదయిస్తాడు. ఆ రోజే విషు అట!

విషుకు ముందురోజే ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. రాత్రి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలను పూలతో తీర్చిదిద్దుతారు. దీపాలు పెడతారు. విషుకన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంట్లోని పెద్ద ముత్తైదువ ఓ పెద్ద పళ్లెంలో అక్షితలు. పచ్చటి నిమ్మకాయలు.. తమలపాకులు. వక్కలు పెడుతుంది. ఈ పళ్లాన్ని ఉర్లి (Uruli)అంటారు.. అందులో భాగవతమో, రామాయణమో పెట్టి పూజమందిరంలో శ్రీకృష్ణుడి (lord krishna)విగ్రహం లేదా పటం ముందు ఉంచుతారు. అలాగే అష్టలక్ష్మి చెంబులో నూతన వస్త్రాన్ని అమర్చుతారు. దాని మీద ఓ అద్దాన్ని పెడతారు. పూజామందిరాన్ని కనికొన్న (kani konna)అనే పూలతో అలంకరిస్తారు. కేరళ రాష్ట్ర అధికార పుష్పాలు ఇవే! ఇవి కేవలం వసంతరుతువులోనే పూస్తాయి. ఆ రాత్రి పూజామందిరంలో పెద్ద ముత్తయిదువు పడుకొని తెల్లవారుజామునే నిద్రలేస్తుంది. కళ్లు తెరవకుండానే భగవద్గీత(Bhagwat-Gita)శ్లోకాలను చదువుతూ దీపాలను వెలిగిస్తుంది. ఈ దీపాలను నీలవిలక్కు అంటారు. దీపాలు వెలిగిన తర్వాత కళ్లు తెరచి అన్ని వస్తువులను కలియచూస్తుంది.. కృష్ణపరమాత్ముడిని భక్తితో ధ్యానించి ఇంట్లోని వారందరిని ఒక్కొక్కరిగా నిద్రలేపి కళ్లు మూసి పూజామందిరానికి నడిపించి తీసుకొస్తుంది. అలా కుటుంబసభ్యులంతా విషుకన్ని దర్శనం చేసుకుంటారు. విషు కన్నిని దర్శించుకున్నాక అన్నం, కొబ్బరి పాలు, బెల్లం తో చేసిన పాయసాన్ని కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తారు. గుళ్లో కూడా ఇదే ప్రసాదంగా ఇస్తారు.ఆ తర్వాత అభ్యంగనస్నానమాచరించి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి పెద్ద పిల్లలకు, పనివాళ్లకు, పేదలకు నగదు బహుమతి ఇస్తాడు. దీన్ని విషుక్కైనీట్టం (Vishukkaineetam)అంటారు.

పండుగ రోజున కొత్త దుస్తులు ధరించిన చిన్నారులు వీధుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి విషు కన్నియే అంటూ ముద్దు ముద్దు మాటలతో పండుగరాకను తెలుపుతారు. ఆ ఇంటి ఇల్లాలు ఆ చిన్నారులకు తీపి వంటకాన్ని కానుకగా ఇస్తుంది. కొందరు డబ్బులు కూడా ఇస్తారు. దీన్ని విషు కన్నివిల్లి అంటారు. ఆ తర్వాత గ్రామపురోహితుడు పంచాంగ శ్రవణం చేస్తాడు. వ్యవసాయ కుటుంబాలు అందంగా ముస్తాబు చేసిన నాగలికి పూజలు చేస్తాయి. ఇంటి పెద్ద ఆ నాగలితో పొలానికి వెళ్లి చాలులు తీస్తాడు. వాటిల్లో ఎండుగడ్డి, ఆవు పేడ వేసి మట్టితో కప్పేస్తాడు.. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయన్నది వారి నమ్మకం. విషు రోజున ఆలయాలన్ని కొత్త శోభను సంతరించుకుంటాయి. భక్తులతో కిటకిటలాడతాయి. విషు రోజున చేసే భోజనాన్ని విషుసద్ది అంటారు. సద్దిలో తీపి, పులుపు, చేదు, వగరు, కారపు పదార్ధాలు తప్పనిసరి. వంటకాల్లో ఉప్పు ఎలాగూ ఉంటుంది. విషు ముందు రోజు రాత్రి, పండుగ రోజు ఉదయం పిల్లలు బాణాసంచా కాలుస్తారు. ఈ వేడుకను విషు పాదక్కమ్‌ (Padakkam)అంటారు..

బెంగాల్‌ వాసులు ఈ పండుగను పొయ్‌లా బైశాఖ్‌గా (poila baishakh) పిల్చుకుంటారు. వీరికి కొత్త సంవత్సరం వైశాఖ మాసంతో ప్రారంభమవుతాయి. వారి క్యాలండర్‌ ప్రకారం చైత్రం ఏడాదిలో చివరి మాసం. వైశాఖ పాడ్యమి రోజున వారు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు. వారి ఆర్ధిక సంవత్సరం కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది. వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలు తెరిచేది ఇప్పుడే! ఇళ్ల ముందు వైవిధ్యమైన రంగవల్లికలు దర్శనమిస్తాయి. ఈ ముగ్గులను అల్పనాలు అంటారు. మహిళలు ఎర్ర అంచున్న తెల్లని సంప్రదాయ చీరను ధరిస్తారు.. పురుషులు ధోతి కుర్తా వేసుకుంటారు. ఉదయాన్నే గుంపులు గుంపులుగా ప్రభాత్‌ ఫేరీ అనే ఊరేగింపులో పాల్గొంటారు. అలా వీధుల్లో తిరుగుతూ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతారు. చెట్ల కిందకు చేరుకుని సూర్యోదయాన్ని తిలకిస్తారు. బంగ్లాదేశ్‌లోనూ బైశాఖ్‌ వేడుకలు జరుగుతాయి..

Updated On 14 April 2023 4:56 AM GMT
Ehatv

Ehatv

Next Story