భారత స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) సరికొత్త రికార్డ్‌ సృష్టించాడు. టెస్టుల్లో ఏడు సంవత్సరాలు 2 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డ్‌(Record) నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో(South africa) జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో 82 బంతుల్లో 72 పరుగులు చేసిన కోహ్లీ... 2023లో అతను 2006 పరుగులు సాధించాడు.

భారత స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) సరికొత్త రికార్డ్‌ సృష్టించాడు. టెస్టుల్లో ఏడు సంవత్సరాలు 2 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డ్‌(Record) నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో(South africa) జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో 82 బంతుల్లో 72 పరుగులు చేసిన కోహ్లీ... 2023లో అతను 2006 పరుగులు సాధించాడు. దీంతో 7 క్యాలెండర్‌ ఇయర్స్‌లో 2 వేల పరుగుల మార్క్‌ దాటిన తొలి క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డ్‌ సృష్టించాడు. అతను గతంలో 2012లో (2186 పరుగులు), 2014లో (2286 పరుగులు), 2016లో (2595 పరుగులు), 2017లో (2818 పరుగులు), 2018లో (2735 పరుగులు), 2019లో (2455 పరుగులు) ఈ ఫీట్ సాధించాడు. 1877లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటి నుంచి అధికారిక రికార్డు ప్రకారం మరే ఇతర ఆటగాడు ఈ రికార్డ్ సాధించలేదు.

కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓడిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు రబడా, మార్కో జాన్సెన్, నాండ్రే బర్గర్‌ల పేస్ త్రయాన్ని ఎదుర్కోవడంలో మిగతా బ్యాటర్లు విఫలమైనా, కోహ్లి వేగంగా సింగిల్స్, బౌండరీలతో పరుగులు రాబట్టాడు.

Updated On 29 Dec 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story