మహారాష్ట్రలోని(Maharashtra) కొల్హాపూర్‌లో(Kolhapur) మలుపు తీసుకుంటున్న ఓ ఆటో(auto) ఓ బైక్‌ను ఢీకొట్టింది.

మహారాష్ట్రలోని(Maharashtra) కొల్హాపూర్‌లో(Kolhapur) మలుపు తీసుకుంటున్న ఓ ఆటో(auto) ఓ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందపడ్డారు. ఆటో డ్రైవర్‌ కూడా ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. ఆటో రన్నింగ్‌లో ఉండటంతో అది నడుస్తున్న వారిపైకి దూసుకుపోయింది. చివరకు రోడ్డు పక్కన ఉన్న టూవీలర్స్ అడ్డుగా ఉండటంతో ఆటో ఆగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. షాహుపురిలోని పాట్కీ హాస్పిటల్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.ఇందులో అయిదుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేశారు. డ్రైవర్‌ లేని ఆటోను దెయ్యం నడిపిందని కొందరు, డ్రైవర్‌ లెస్‌ ఆటో అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story