ఢిల్లీ లైఫ్ లైన్ గా పిలుచుకునే మెట్రో.. ప్ర‌స్తుతం రీల్స్‌ హబ్ గా మారింది. ప్రతిరోజూ మెట్రోకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి వైరల్‌గా మారిన వీడియోపై యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని నెలలుగా ఢిల్లీ మెట్రోలో(Delhi Metro) జ‌నాలు వింత వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించి వైరల్ అయ్యే వీడియోల(Viral videos) సంఖ్య కూడా పెరిగింది. తాజాగా ఒక జంట వింత చేష్ట‌ల వీడియో ఒక‌టి నెట్టింట‌ వైర‌ల్ అవుతుంది. ఈ వీడియో చూడగానే ఎవరికైనా వికారం పుట్టేలా వారి ప్రవర్తన ఉంటుంది.

ఢిల్లీ లైఫ్ లైన్ గా పిలుచుకునే మెట్రో.. ప్ర‌స్తుతం రీల్స్‌ హబ్ గా మారింది. ప్రతిరోజూ మెట్రోకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి వైరల్‌గా మారిన వీడియోపై యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో(Social Media) షేర్ చేసిన ఈ వీడియో ఢిల్లీ మెట్రోకు చెందినదిగా చెబుతున్నారు. ఇందులో ఓ జంట మెట్రోలో కూర్చున్నారు. వీడియో ప్రారంభంలో యువ‌కుడు.. యువ‌తి నోటిలో డ్రింక్ పోశాడు. ఆ యువ‌తి తన నోటితో అదే డ్రింక్‌ని యువ‌కుడి నోటిలోకి పోర్స్‌గా ఊసింది. తిరిగి ఆ యువ‌కుడు కూడా యువ‌తి నోట్లోకి డ్రింక్‌ను వ‌దిలాడు. ఆ త‌ర్వాత ఇరువురూ ఒక‌రి ముఖాన్ని ఒక‌రు త‌నివితీరా చూసుకుంటారు. ఈ వీడియోకు డ‌బుల్ ఫిల్ట‌ర్ ఆర్ఓ అని క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు. ప్ర‌స్తుతం వీడియో వైర‌ల్ అవుతుంది.

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో లాంటి పబ్లిక్ ప్లేస్ లో ఆ జంట‌ కన్నెత్తి కూడా చూడలేని విధంగా ప్ర‌వ‌ర్తించారంటూ మండిప‌డుతున్నారు. వారిని చూస్తే.. ఎవరినీ పట్టించుకునేలా లేర‌ని కామెంట్లు చేస్తున్నారు.

Updated On 11 Oct 2023 2:59 AM GMT
Ehatv

Ehatv

Next Story