మన వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

మన వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటిలో సాధువులు నివసిస్తుంటారు. వీరు లోకాన్ని పట్టించుకోరు. తమనూ పట్టించుకోరు. శరీరంపై మమకారం పెంచుకోరు. కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తారు. ఉపాసనలోనే జీవితం గడుపుతారు. అందులోనే ఆనందం అనుభవిస్తారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు.. మంచి చెడులు చెప్తారు. ఆశీర్వదిస్తారు.. కానీ పర్వత శ్రేణులు, గృహల్లో ఉండే సాధువులకు లోకం పట్టదు. వీళ్లు ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు. వీళ్ల దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు.. తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు. ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు. స్వచ్ఛ మైన నీటిని తాగుతారు. ఒంటి నిండా విభూతే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు.. దేనిపైనా మోజు ఉండదు.. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు.. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి వస్తారు. పవిత్రస్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్లిపోతారు.

వీరి ఆరోగ్యంపై సైన్స్ పరిశోధనలు ఎన్ని చేసినా వాస్తవాలు తెలియరాలేదు. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన ఈ సాధువులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. వారు కోరుకున్నప్పుడు మృత్యువు దరి చేరే సామర్థాన్ని సాధించారు. అందుకే ఎన్నేళ్లయినా వారి శరీరం క్షీణించదు. రోగాలు దగ్గరకు రావు. కఠోర నియమనిబంధనలు పాటిస్తారు. అమితమైన ఆత్మవిశ్వాసం కారణం. సృష్టి కర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు.. ఈ లోకాన్ని సృష్టించింది.. నడిపిస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అనే వారు భావిస్తారు..తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి పొందుతుంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నమ్ముతారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. బెంగళూరులోని ఓ గుహ నుంచి 188 ఏళ్ల వృద్ధుడిని రక్షించినట్లు ఈ వీడియో సారాంశం. ఈ వీడియో ఇప్పటికే దాదాపు 29 మిలియన్ల మంది దృష్టిని ఆకర్షించింది. 24 సెకన్ల ఈ వీడియోలో ఓ సాధువు కర్ర సాయంతో నడుస్తుండగా మరో ఇద్దరు అతనికి సాయం చేయడం చూస్తాం. అయితే ఎక్స్‌లోనే మరో వీడియో వైరలవుతోంది. ఇది తప్పుడు కథనం.. ఈ సాధువు

మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న 'సియారామ్ బాబా' అనే హిందూ సన్యాసి అని.. అతని వయస్సు సుమారు 110 సంవత్సరాలు పలు నివేదికలు తెలుపుతున్నాయి. వీడియోలోని వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపును వెల్లడిస్తూ జూలై 2, 2024 నాటి నవభారత్ టైమ్స్ కథనం ప్రసారం చేసింది. ఈ వృద్ధుడు, సియారామ్ బాబా వయస్సు 109. సియారామ్ బాబా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందారు.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో నివసిస్తున్నారని తెలిపింది. వాస్తవం ఏమిటంటే ఆ వృద్ధుడు భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న 'సియారామ్ బాబా' అనే సాధువు అని నిర్ధారణ అయింది. ఏది ఏమైనా 109 ఏళ్లు బతికన సాధువును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story