పెళ్లి వేదికను అందంగా ముస్తాబు చేశారు. మరి కాసేపట్లో పెళ్లి .. వివాహానికి రెండు కుటుంబాల బంధు మిత్రులంతా తరలివచ్చారు. అటు వరుడు, ఇటు వధువు ముహూర్త సమయం కోసం ఎదురుచూస్తున్నారు. వరుడు, అతడి కుటుంబసభ్యులు ఊరేగింపుతో వధువు ఇంటికి వచ్చారు. వధువు తరపు వారు వారికి స్వాగతం పలికారు. సత్కారాలు చేశారు.
పెళ్లి వేదికను అందంగా ముస్తాబు చేశారు. మరి కాసేపట్లో పెళ్లి .. వివాహానికి రెండు కుటుంబాల బంధు మిత్రులంతా తరలివచ్చారు. అటు వరుడు, ఇటు వధువు ముహూర్త సమయం కోసం ఎదురుచూస్తున్నారు. వరుడు, అతడి కుటుంబసభ్యులు ఊరేగింపుతో వధువు ఇంటికి వచ్చారు. వధువు తరపు వారు వారికి స్వాగతం పలికారు. సత్కారాలు చేశారు. వధువు మెడలో వరుడు జయమాల వేయాల్సిన సమయం ఆసన్నమయ్యంది. ఆ నిమిషంలో పెళ్లి కొడుకు మెదడును ఏ పురుగు తొలిచిందో తెలియదు కానీ అదనపు కట్నం కోసం డిమాండ్ చేశాడు. వరుడికి నచ్చ చెప్పడానికి బంధు మిత్రలంతా ప్రయత్నించారు. అతడు అసలు వినలేదు. అదనపు కట్నం ఇస్తే తప్ప వరమాల మెడలో వేసుకోనని మంకు పట్టాడు. అతడి వాలకం చూసి వధువుకు, ఆమె కుటుంబానికి చెర్రెత్తుకొచ్చింది. దాంతో పాటు కోపమూ వచ్చింది. వెంటనే వరుడిని చెట్టుకు కట్టేసింది. వరుడి తరపున వచ్చిన చాలా మంది అతిథులను బందీలను చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గడ్‌లో జరిగింది. ఇందుకు సంబంధిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులకు విషయం తెలిసింది. వారు ఘటన స్థలానికి వచ్చి ఇరు వర్గాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లోనూ పంచాయితీ జరిగింది. కానీ ఫలితం లేకుండాపోయింది.