Vinesh Phogat : వినేష్ ఫోగట్‌ను అలానే స్వాగతిస్తాం, సత్కరిస్తాం.. సీఎం ప్రకటన
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల బరువు విభాగంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు.. వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఎలిమినేట్ అవడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు నిరాశ చెందారు.
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల బరువు విభాగంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు.. వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఎలిమినేట్ అవడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు నిరాశ చెందారు. వినేష్ బంగారు పతకం గెలుస్తుందని నమ్మకంతో క్రీడా ప్రేమికులు ఉన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం వచ్చిన బ్యాడ్ న్యూస్ అందరి మనోధైర్యాన్ని దెబ్బతీసింది.
ఇదిలావుంటే.. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీ తన X ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ.. వినేష్ మనందరి ఛాంపియన్ అని రాశారు. వినేష్ ఫోగట్‌ను పతక విజేతలా స్వాగతించాలని.. సత్కరించాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. ఒలింపిక్ రజత పతక విజేతకు హర్యానా ప్రభుత్వం ఇచ్చే సన్మానాలు, అవార్డులు, సౌకర్యాలు కూడా వినేష్ ఫోగట్‌కు కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వబడతాయని పేర్కొన్నారు.
ఆగస్టు 7న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో వినేష్ అమెరికాకు చెందిన సారా ఆన్ హిల్డెబ్రాండ్‌తో తలపడాల్సి ఉండగా.. అనర్హత వేటు పడింది. మంగళవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్‌లో వినేష్ 5-0తో క్యూబాకు చెందిన యుస్నెలిస్ గుజ్‌మన్ లోపెజ్‌పై విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు కాంస్య పతకాలు సాధించగా.. అవన్నీ షూటింగ్ లో వచ్చినవే కావడం విశేషం.