భారత రెజ్లర్లు(Wrestlers) చేస్తున్న నిరసన పట్ల కేంద్ర ప్రభుత్వానికి(Central Governament) ఇసుమంతైనా సానుభూతి లేదు. సమస్యను పరిష్కరిద్దామన్న సంకల్పమూ లేదు. అసలు రెజర్ల సమస్యపై దృష్టి పెట్టే తీరిక కూడా లేదు. గత నెల 23 నుంచి జంతర్‌మంతర్(jantarmantar) దగ్గర భారత రెజ్లర్లు నిరసన చేస్తున్నారు.
భారత రెజ్లర్లు(Wrestlers) చేస్తున్న నిరసన పట్ల కేంద్ర ప్రభుత్వానికి(Central Governament) ఇసుమంతైనా సానుభూతి లేదు. సమస్యను పరిష్కరిద్దామన్న సంకల్పమూ లేదు. అసలు రెజర్ల సమస్యపై దృష్టి పెట్టే తీరిక కూడా లేదు. గత నెల 23 నుంచి జంతర్‌మంతర్(jantar mantar) దగ్గర భారత రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. వారికి పెద్ద పెద్ద డిమాండ్లేమీ లేవు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను(Briz Bhushan Sharan singh) పదవి నుంచి తొలగించాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో నిరసన చేపట్టారు.
ఎందుకూ అంటే అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కాబట్టి! అతడిని పదవిలోంచి తొలగించడం ప్రభుత్వానికి నిమిషాల మీద పని! అతడు బీజేపీ ఎంపీ కాబట్టి ఆ పని చేయరు . ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) నేరస్తులను ఏరిపారేయడమే తమ లక్ష్యమని చెప్పుకునే ముఖ్యమంత్రి యోగి(CM Yogi) కూడా ఈ పని చేయరు.
రెజ్లర్ల ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుండటంతో ప్రభుత్వం వారి నిరసనను ఆపించి, వారిని అక్కడ నుంచి తరలించడానికి ప్రయత్నించింది. నిన్న రాత్రి భారీ సంఖ్యలో ఢిల్లీ(Delhi) పోలీసులు జంతర్‌మంతర్ దగ్గరకు చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం(quarrels) చోటు చేసుకుంది. వర్షం కారణంగా తరలిచిపోయిన పరుపులను కూడా మార్చుకోనివ్వలేదు పోలీసులు.
కొంతమంది సభ్యులను ఢిల్లీ పోలీసులు దూషించారు కూడా! ఇలాంటి రోజులు చూడటానికేనా! తాము పతకాలు సాధించింది? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు వినేష్ ఫోగట్(vinesh phogat). తమపై ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదంటూ మండిపడ్డారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు లేకపోవడంపై నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మద్యం మత్తులో దుర్భాషలాడి(vulgar language), తమపై దాడి చేశారన్నారు.
ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఈ క్రమంలో రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో నాలుగు పతకాలు గెలుచుకున్న బజరంగ్ పునియా(bajrang punia) ఉద్వేగభరితంగా తన పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాని అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమతి లేకుండా భారతి మంచాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారట! అందుకే ఆయనతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జంతర్‌మంతర్ ప్రాంతాన్ని సీల్ చేశారు పోలీసులు. రెజ్లర్లను కలవడానికి వస్తున్న విపక్షాలను అడ్డుకున్నారు.