ఐతే ఈ బంగారు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బ్రిటిష్ కాలంలో సంపన్న పట్టణంగా పేరున్న 'మహేష్‌పూర్ రాజ్‌బరి' చాలా వరకు సుబర్ణరేఖ నది నీటిలో మునిగిపోయిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అక్కడి నుంచి సుబర్ణరేఖ నది ద్వారా బాన్‌స్లోయి నదికి వచ్చి చేరి ఉంటుందని తెలిపారు .

బంగారం అంటే చాలా మందికి ఇష్టమే.. అంతేకాదు ఈ బంగారం మన సంస్కృతిలో భాగమైపోయింది . అందుకే ప్రతి మహిళ కూడా బంగారు ఆభరణాలను వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. ఐతే ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అలాంటి ఎంతో విలువైన బంగారం.. ఉచితంగా దొరికితే ఎవరైనా వదలిపెడతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం .. ఇలా బంగారం దొరకడంతో ... దొరికినోళ్లకు దొరికినంత అన్నట్టుగా ...అందిన కాడికీ తీసుకెళ్లారు. ఇంతకీ ఇది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా ? పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఆ ఊరి నదిలో బంగారం దొరుకుతుండటంతో గ్రామస్తులంతా ఎగబడి మరీ తీసుకెళ్తున్నారట.

పార్కండి గ్రామం మీదుగా బన్‌స్లోయి నది ప్రవహిస్తుంది. ఎండాకాలంలో నీరు ఎక్కువగా ఉండదు. ఐతే ఈ నదిలోని ఇసుకలో బంగారం దొరుకుతోందన్న వార్త ఊరంతా గుప్పుమంది . ఇప్పటికే కొందరు వ్యక్తులకు బంగారం దొరికిందన్న ప్రచారం జరగడంతో.. అందరూ నది ఒడ్డుకు పరుగులు పెట్టారు ...అక్కడి కి వెళ్లిన వారు బంగారం దొరుకుతుందని ఇసుకను తవ్వడం మొదలు పెట్టారు . అలా తవ్విన వారిలో కూడా కొందరికి బంగారం దొరికిందట. ఝార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి కి కూడా రెండు రోజుల క్రితం నది ఒడ్డున మొదట ఈయనకే బంగారం దొరికిందని స్థానికులు తెలిపారు . ఈ వార్త కాస్తా ఆ నోటా ఈ నోటా పడి అందరికీ తెలియడంతో.. గ్రామస్తులంతా నది వద్దకు చేరుకొని.. బంగారం కోసం వెతుకుతున్నారు. బంగారు నాణేలు వంటి పలు గుండ్రటి వస్తువులు లభించినట్లు స్థానిక వర్గాల ద్వారా తెలిసింది.

రెండు రోజుల క్రితం కూడా ఇక్కడి నదిలో ఇసుకలో తనకు బంగారం దొరికిందని స్థానిక యువకుడు సుజన్ షేక్ తెలిపారు. అందుకే తాను కూడా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. తనకైతే ఇప్పుడు దొరకలేదని.. కానీ చాలా మందికి చిన్న చిన్న బంగారం నాణేలు దొరికాయని తెలిపాడు . ఐతే ఈ బంగారు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బ్రిటిష్ కాలంలో సంపన్న పట్టణంగా పేరున్న 'మహేష్‌పూర్ రాజ్‌బరి' చాలా వరకు సుబర్ణరేఖ నది నీటిలో మునిగిపోయిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అక్కడి నుంచి సుబర్ణరేఖ నది ద్వారా బాన్‌స్లోయి నదికి వచ్చి చేరి ఉంటుందని తెలిపారు .

అయితే బంగారం కోసం పార్కండి గ్రామానికి వచ్చే వారి సంఖ్య పెరగడంతో... పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానిక అధికారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా.. రివర్ క్రాసింగ్ కాపలాగా ఉన్నారు. నది వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఈ విషయంపై భారత పురావస్తు శాఖకు సమాచారం అందించామని రాంపూర్‌హట్ సబ్ డివిజనల్ కమిషనర్ తెలిపారు. వారి బృందం వచ్చి ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. కాగా, సుబర్ణరేఖ నదికి ఇప్పటికే గోల్డ్ రివర్‌గా పేరున్న విషయం తెలిసిందే. అక్కడి నదిలో బంగారం ప్రవహిస్తోందని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే బన్‌స్లోయి నదిలో బంగారం దొరకడం ఆసక్తి రేపుతోంది.

Updated On 18 March 2023 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story