పై ఫోటోలో కనిపిస్తున్న కాయలను గుర్తుపట్టారా? దబ్బకాయలని అనుకుంటున్నారా? అయితే దెబ్బతిన్నట్టే... ఇవి నిమ్మకాయలు(Lemon)..అనుమానమేం అక్కర్లేదు. నిజంగానే నిమ్మకాయలు! ఈ సైజు నిమ్మకాయలను చూసి ఉండమని అనుకుంటున్నారు కదూ! ఈ రేంజ్‌లో నిమ్మకాయలను చూడటం చాలా మందికి ఇదే ఫస్ట్‌టైమ్‌ ! కర్ణాటకలో(Karnataka) కొడుగు(Kodugu) జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి వెళితే ప్రత్యక్షంగా వీటిని చూసే అవకాశం కలుగుతుంది. విజు సుబ్రమణి(Viju Subramani) అనే వ్యక్తి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నాడు.

పై ఫోటోలో కనిపిస్తున్న కాయలను గుర్తుపట్టారా? దబ్బకాయలని అనుకుంటున్నారా? అయితే దెబ్బతిన్నట్టే... ఇవి నిమ్మకాయలు(Lemon)..అనుమానమేం అక్కర్లేదు. నిజంగానే నిమ్మకాయలు! ఈ సైజు నిమ్మకాయలను చూసి ఉండమని అనుకుంటున్నారు కదూ! ఈ రేంజ్‌లో నిమ్మకాయలను చూడటం చాలా మందికి ఇదే ఫస్ట్‌టైమ్‌ ! కర్ణాటకలో(Karnataka) కొడుగు(Kodugu) జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి వెళితే ప్రత్యక్షంగా వీటిని చూసే అవకాశం కలుగుతుంది. విజు సుబ్రమణి(Viju Subramani) అనే వ్యక్తి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నాడు. వీటిని చూడటానికి జనం పెద్దసంఖ్యలో వస్తున్నారు. సాధారణంగా ఇవి యూరప్‌(Europe) దేశాలలోనే కనిపిస్తాయి. వీటితో ఊరగాయలు పెట్టుకుంటారు. లేదా శీతలపానీయాల తయారీలో ఉపయోగిస్తారు. మరి ఐరోపాలోనే అరుదుగా కనిపించే ఈ మొక్కలు సుబ్రమణి దగ్గరకు ఎలా వచ్చాయి? నాలుగేళ్ల కిందట మైసూర్‌కు వెళ్లినప్పుడు ఓ మార్కెట్‌లో ఈ విత్తనాలను కొన్నాడట సుబ్రమణి. తర్వాత వాటిని తన ఇంటి సమీపంలో ఉన్న గార్డెన్‌లో పెంచాడట! పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేశానని చెప్పాడు సుబ్రమణి. మూడేళ్లకు ఈ నిమ్మ చెట్లు పెరిగి పెద్దవయ్యాయని, అయితే ఈ చెట్లకు నిమ్మపువ్వులు, కాయలు రాకపోతే అసలిది నిమ్మ చెట్టేనా అన్న డౌట్‌ వచ్చిందని చెప్పుకొచ్చాడు. తర్వాత కొద్ది రోజులకే పంట రావడం మొదలయ్యిందని, చూస్తుండగానే నిమ్మకాయలు భారీ సైజులో కాసాయని అన్నాడు. మామూలుగా అయితే ఓ నిమ్మకాయ 60 గ్రాముల బరువుంటుంది. ఇవి మాత్రం అయిదు కిలోల బరువుంటున్నాయి. ఈ నిమ్మకాయలను సుబ్రమణి ఆర్గానిక్‌ పద్దతిలో పండిస్తుండటం గమనార్హం. ఈ భారీ నిమ్మకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల తోపాటు ఔషధ ఉపయోగాలున్నాయంటున్నారు నిపుణులు.

Updated On 26 Dec 2023 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story