తమిళనాడులో(Tamilnadu) ఇవాళ లోక్‌సభ ఎన్నికలు(Lok sabha elections) జరుగుతున్నాయి. ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్‌లో ఓటు వేయడానికి ప్రముఖ హీరోలు తరలివచ్చారు. కమలహాసన్(Kamal Haasan), రజనీకాంత్(Rajinikanth), ధనుష్(Danush), విజయ్ సేతుపతి(Vijay Sethupathi), అజిత్(Ajit), విక్రమ్(Vikram), కార్తీక్(Karthik), ఇళయరాజ(Ilayaraja), ఖుష్బూ(Kushbhu), రాధిక(Radhika), శరత్‌కుమార్(Sharath kumar) ఇంకా చాలా మంది ఓటు వేశారు.

Vaijay Sethupathi
తమిళనాడులో(Tamilnadu) ఇవాళ లోక్‌సభ ఎన్నికలు(Lok sabha elections) జరుగుతున్నాయి. ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్‌లో ఓటు వేయడానికి ప్రముఖ హీరోలు తరలివచ్చారు. కమలహాసన్(Kamal Haasan), రజనీకాంత్(Rajinikanth), ధనుష్(Danush), విజయ్ సేతుపతి(Vijay Sethupathi), అజిత్(Ajit), విక్రమ్(Vikram), కార్తీక్(Karthik), ఇళయరాజ(Ilayaraja), ఖుష్బూ(Kushbhu), రాధిక(Radhika), శరత్‌కుమార్(Sharath kumar) ఇంకా చాలా మంది ఓటు వేశారు. విదేశాలలో ఉన్న దళపతి విజయ్(Vaijay Thalapathy) కూడా ఇవాళ తమిళనాడుకు వచ్చి ఓటు వేశారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉన్న విజయ్ సేతుపతి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు వీల్‌చైర్‌లో నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు ఆయనను సెల్ఫీ కోరింది. విజయ్ నటన అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. మంచి భవిష్యత్తు ఉన్న నటుడు విజయ్ అని కితాబిచ్చింది. వెంటనే విజయ్ సేతుపతి ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆమెతో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశారు. ఆమె తనకు తల్లిలాంటిదని చెప్పి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎంతో మంది అభిమానులు ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చి మురిసిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
