లేడి సూపర్‌స్టార్‌ నయనతార- కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్నది.

లేడి సూపర్‌స్టార్‌ నయనతార- కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్నది. నయనతార కెరీర్‌, పెళ్లి తదితర అంశాలతో ఓ డ్యాకుమెంటరీ తీశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డ్యాకుమెంటరీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో తాను నిర్మించిన నానుమ్‌ రౌడీదాన్‌ సినిమా క్లిప్పింగ్‌లు వాడటంపై ధనుష్‌ అభ్యంతరం చెప్పాడు. మూడు సెకన్ల సీన్‌ వాడినందుకు 10 కోట్ల రూపాయల దావా వేశారు. ఆ తర్వాత నయనతార ఓ పెద్ద బహిరంగ లేఖ రాసిం. ధనుష్‌ వ్యవహారశైలి బాగోలేదని రాసింది. ధనుష్‌ను చెడ్డవాడుగా చిత్రీకరించే ప్రయత్నం ఆ లేఖలో చేసింది. నిజానికి నయనతారనే తప్పు చేసింది. అయినా సరే ధనుష్‌నే తప్పుపట్టాలని చూసింది. కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉన్న ధనుష్ ఇటీవల నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌కి కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించాడు. పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నయనతారను ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ గొడవ జరుగుతున్నప్పుడే కొన్నిరోజుల కిందట విఘ్నేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టుపై ధనుష్‌ ఫ్యాన్స్‌ చెడుగుడు ఆడటంతో దెబ్బకు దాన్ని డిలీట్‌ చేశాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో అజిత్‌ సినిమా ఎన్నై అరిందాల్‌ సినిమా కోసం ఓ పాట రాశానని, అదే సమయంలో తన మొదటి సినిమా నానుమ్‌ రౌడీదానే సినిమా చూసి అజిత్‌ మెచ్చుకున్నారని రాసుకొచ్చారు.

అయితే నానుమ్ రౌడీదానే సినిమా విడుదల కావడానికి 7 నెలల ముందు అజిత్ సినిమా విడుదల అయ్యిందని, థియేటర్లలో రాక ముందే అజిత్‌ ఆ సినిమాను ఎలా చూశారని ప్రశ్నిస్తూ ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్‌ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలాగే ధనుష్ మొదటి సినిమా చేసే అవకాశం ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్‌కి లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా చూసి విఘ్నేశ్‌ తన ట్విటర్‌ ఖాతాను డిలీట్‌ చేశాడు.

ehatv

ehatv

Next Story