సోషల్ మీడియా(Social media) అప్పట్లో లేదు కాబట్టి సప్త వ్యసనాలని అన్నారు కానీ ఇదో అష్టమ వ్యసనంగా మారింది. ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లలో కొందరు హద్దులు దాటుతున్నారు. వ్యూస్ పెంచుకోవడానికి, ఫాలోవర్లను అట్రాక్ట్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. డ్యాన్స్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను(Instagram Reels) పబ్లిక్‌గా రికార్డు చేస్తున్నారు.
సోషల్ మీడియా(Social media) అప్పట్లో లేదు కాబట్టి సప్త వ్యసనాలని అన్నారు కానీ ఇదో అష్టమ వ్యసనంగా మారింది. ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లలో కొందరు హద్దులు దాటుతున్నారు. వ్యూస్ పెంచుకోవడానికి, ఫాలోవర్లను అట్రాక్ట్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. డ్యాన్స్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను(Instagram Reels) పబ్లిక్‌గా రికార్డు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలకు బోల్డన్నీ వ్యూస్ వస్తుండవచ్చు కానీ జనాలకు మాత్రం ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయోధ్యలోని(Ayodhya) సరయూ నదిలో(Sarayu River) ఓ మహిళ రీల్స్ కోసం డాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింక్ సల్వార్ సూట్ వేసుకున్న ఈ యువతి జీవన్ మే జానే జానా అనే బాలీవుడ్ పాటకు సరయూ ఘాట్ దగ్గర డాన్స్ చేస్తూ కనిపించింది. పవిత్రమైన సరయూ నదిలో ఈ పిచ్చి వేషాలేమిటని చాలా మంది ఆడిపోసుకుంటున్నారు. పవిత్రస్థలాన్ని అపవిత్రం చేసి, అగౌరపరిచిన ఆ యువతిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన అయోధ్య పోలీసులు ఆమెపై తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొన్ని నెలల కిందట ఇదే సరయూ నది ఘాట్‌పై ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పానీమే ఆగ్ లగానీ హై పాటకు ఆమె డాన్స్ చేస్తుంటే అక్కడే ఉన్న కొందరు ఆమెను అలాగే చూస్తుండి పోయారు. ఈ వీడియో తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఇలాంటి డ్యాన్సులు చేయకూడదని నిరసన వ్యక్తం చేశారు.