అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన రేసుగుర్రం(Racegurram) సినిమా గుర్తున్నది కదా! అందులో విలన్ రవి కిషన్(Ravi kishan) శుక్లా ప్రస్తుతం గోరఖ్‌పూర్ లోక్‌సభ సభ్యుడు. బీజేపీ(BJP) నుంచి ఆయన గెలిచారు. బీజేపీ అధిష్టానం ఇప్పుడు మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది.

MP Ravi kishan
అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన రేసుగుర్రం(Racegurram) సినిమా గుర్తున్నది కదా! అందులో విలన్ రవి కిషన్(Ravi kishan) శుక్లా ప్రస్తుతం గోరఖ్‌పూర్ లోక్‌సభ సభ్యుడు. బీజేపీ(BJP) నుంచి ఆయన గెలిచారు. బీజేపీ అధిష్టానం ఇప్పుడు మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో ఓ మహిళ మీడియా ముందుకొచ్చింది. తన కూతురుకు అసలు తండ్రి రవి కిషన్ శుక్లానేనని ఆరోపించింది. రవికిషన్ వెంటనే తన కూతురును స్వీకరించాలని తెలిపింది. ఆమె చెప్పేది పచ్చి అబద్ధమని రవికిషన్ భార్య ప్రీతి శుక్లా(Preety Shukla) అన్నారు. అనడమే కాదు, హజ్రత్‌గంజ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ మహిళతో పాటు అపర్ణా ఠాకూర్, ఆమె భర్త రాజేశ్ సోనీ, కూతురు షెనోవా సోని, కొడుకు సొనాక్ సోనీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు వివేక్ కుమార్ పాండే, జర్నలిస్టు ఖుర్షీద్ ఖాన్‌లపై కేసు పెట్టారు. అపర్ణ సోనీ అలియాస్ అపర్ణా ఠాకూర్ తనకు అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని బెదిరించిందని ప్రీతి శుక్లా ఆరోపించారు. ఆమె 20 కోట్ల రూపాయల డబ్బును డిమాండ్ చేసిందని తెలిపారు. అడిగిన డబ్బును ఇవ్వకపోతే రవి కిషన్‌ను అత్యాచారం కేసులో ఇరికించి ప్రతిష్టను దిగజారుస్తామని బెదిరించినట్టు పోలీసులకు తెచెప్పారు.
