బీజేపీ(BJP) భక్తమండలి ఉచ్చనీచాలు మర్చిపోతున్నది. మహిళలపై రవ్వంత మర్యాద కూడా చూపని ఆ పార్టీ బృందం ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(Trinamool Congress Party) ఎంపీ అభ్యర్థి మహువా మొయిత్రాపై(Mahua Moitra) తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ శునకానందాన్ని పొందుతున్నది.
బీజేపీ(BJP) భక్తమండలి ఉచ్చనీచాలు మర్చిపోతున్నది. మహిళలపై రవ్వంత మర్యాద కూడా చూపని ఆ పార్టీ బృందం ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(Trinamool Congress Party) ఎంపీ అభ్యర్థి మహువా మొయిత్రాపై(Mahua Moitra) తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ శునకానందాన్ని పొందుతున్నది. బీజేపీ కోసం పని చేసే ఐటీ సెల్‌లోని బృందం రెండు రూపాయల కోసం కకుర్తిపడి మహిళ అని కూడా చూడకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఎందుకంటే మహువా మొయిత్రా ధీరోదాత్తురాలు కాబట్టి. మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను ఎండగడుతున్నారు కాబట్టి. ఆయన కంటే మంచి వక్త కాబట్టి. ఆయన కంటే ఇంగ్లీషులో ధాటిగా మాట్లాడతారు కాబట్టి. అన్నింటికంటే ముఖ్యమైనది ఆయన కంటే ఎక్కువ చదువుకున్నారు కాబట్టి.
అందుకే ఆమెను లోక్‌సభలో అడుగుపెట్టకుండా చేయాలను కుటిల రాజనీతిని ప్రదర్శిస్తున్నది. పార్లమెంట్‌లో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారంటూ ఇప్పటికే ఓ అసత్య ఆరోపణలు చేసి ఆమెను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయించారు. ఇప్పుడు మళ్లీ ఆమె లోక్‌సభలో అడుగుపెడితే తమకు ముచ్చెమటలు పట్టిస్తుందన్న ఏకైక కారణంతో ఆమెను టార్గెట్ చేశారు. ప్రచారంలో భాగంగా ఆమె ఓ వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో స్థానిక టీవీ చానెల్ విలేకరి మహువా మొయిత్రాను ఓ ప్రశ్న అడిగారు. మీకు ఇంత ఎనర్టీ ఎలా వస్తున్నది? అని అడడితే ఆమె ఎగ్స్ అని నవ్వుతూ జవాబిచ్చారు. ఒక్కసారి కాదు రెండుసార్లు ఆమె ఎగ్స్(Eggs) ఎగ్స్ అని జవాబు చెప్పారు. అయితే బీజేపీ భజన బృందం ఆ ఆడియోను డాక్టరింగ్ చేసి సెక్స్‌గా మార్చింది. ఇక ఆ ట్వీట్‌ను వైరల్ చేయడం మొదలు పెట్టింది. వైరల్ చేస్తున్నది కూడా ఆ బ్యాచేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను ఆడిగిన ప్రశ్నకు ఆమె ఎగ్స్ అని జవాబిచ్చారని ఆ రిపోర్టరే చెబుతున్నా కాషాయిదళ సభ్యులకు చెవికి ఎక్కడం లేదు. మహిళలంటే వారికి చిన్నచూపు. ఈ విషయాన్ని రాస్తున్న కొందరు జర్నలిస్టులు కూడా నిజమేదో అబద్ధమేదో తెలుసుకుని సోయి తెచ్చుకుని రాస్తే బాగుండేది.