అదృష్టవంతులను చెరిపేవాళ్లు లేరంటారు పెద్దలు. పిసరంత లక్కున్నా చాలు ఎంత పెద్ద ప్రమాదంలోంచైనా ఇట్టే బయటపడవచ్చు.

అదృష్టవంతులను చెరిపేవాళ్లు లేరంటారు పెద్దలు. పిసరంత లక్కున్నా చాలు ఎంత పెద్ద ప్రమాదంలోంచైనా ఇట్టే బయటపడవచ్చు. ఇది నిజమేనని ఓ మహిళ ప్రూఫ్‌ చేసింది! వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఆమెపై ఓ పెద్ద వాటర్‌ ట్యాంక్‌(Water tank) పడింది. అయినా ఆమెకు వీసమెత్తు గాయం కూడా కాలేదు. ఢిల్లీలో(Delhi) జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన ఇంటి ఎదురుగా ఉండే మరో మహిళతో మాట్లాడిన తర్వాత రోడ్డుపై నడుచుకుంటూ తన ఇంటికి వెళుతోందా మహిళ. పైగా ఆపిల్ పండును తింటూ! అంతలోనే ఓ వాటర్‌ ట్యాంక్‌ ఆమెపై పడింది. ట్యాంక్‌ అడుగు భాగంలో రంధ్రం ఉండటంతో ఆమె బతికిపోయింది. మనిషంత ఎత్తున్న ఆ ట్యాంక్‌లో ఆమె చిక్కుకుపోయింది. ఇది చూసి చుట్టుపక్కలవాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చారు. వాటర్‌ టాంక్‌ను నిర్లక్ష్యంగా పడేసిన వారిని సుతిమెత్తగా తిట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే పది లక్షలకు పైగా ఈ వీడియోను చూశారు. కామెంట్లు కూడా వేలకొద్దీ వస్తున్నాయి. రోజుకో ఆపిల్ తినండి.. డాక్టర్‌కు దూరంగా ఉండండి అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

Eha Tv

Eha Tv

Next Story