కేరళలోని(Kerala) ఎర్నాకులం జిల్లా ఫోర్ట్‌ కొచ్చిలో(Fort Kochi) ఓ వివాదాస్పద ఘటన జరిగింది. పాలస్తీనా(Palastine) అనుకూల పోస్టర్‌ను ఓ ఆస్ట్రియన్‌(Austria) యూదు పర్యాటకురాలు చించేసింది.

కేరళలోని(Kerala) ఎర్నాకులం జిల్లా ఫోర్ట్‌ కొచ్చిలో(Fort Kochi) ఓ వివాదాస్పద ఘటన జరిగింది. పాలస్తీనా(Palastine) అనుకూల పోస్టర్‌ను ఓ ఆస్ట్రియన్‌(Austria) యూదు పర్యాటకురాలు చించేసింది. ఆమెను వారించడానికి స్థానిక యువకులు ప్రయత్నించినప్పటికీ ఆమె వినిపించుకోకుండా వాదనకు దిగింది. ఆ పోస్టర్‌ చినిగిన ముక్కలను తీయమని ఆ యువకులు చెబుతున్నా పట్టించుకోలేదు. పోస్టర్‌కు ఏమైనా సమస్య ఉంటే పోలీసులకు చెప్పొచ్చు కానీ ఇలా చించేయమేమిటని యువకులు ఆమెను నిలదీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కేరళ పోలీసులు విచారణ కోసం ఆమెను స్టేషన్‌కు రావాలని చెప్పారు. ఆ మహిళపై స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా కొచ్చి ఏరియా సెక్రటరీ మహమ్మద్‌ అజీమ్‌ పోలీసులకు కంప్లయింట్‌ చేసినా వారు పెద్దగా పట్టించుకోలేదు. ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు. జనవరిలో కోజికోడ్ బీచ్ సమీపంలోని స్టార్‌బక్స్ స్టోర్‌పై ఫ్రీ పాలస్తీనా అంటూ ఆ దేశ అనుకూల పోస్టర్‌లు అతికించిన ఆరుగురు విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

Updated On 17 April 2024 5:39 AM GMT
Ehatv

Ehatv

Next Story