శరన్నవరాత్రుల సమయంలో ఉత్తరాదిన రామ్‌లీలా(Ram leela) నాటకాన్ని ప్రదర్శించడం కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయం.
శరన్నవరాత్రుల సమయంలో ఉత్తరాదిన రామ్‌లీలా(Ram leela) నాటకాన్ని ప్రదర్శించడం కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఈ నాటకం కోసం కొన్ని నెలల ముందు నుంచే రిహార్సల్స్ మొదలవుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) అమ్రోహా జిల్లాలో(Amreha) దసరా(Dasara) రోజున రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించారు. నాటకంలో రాముడు, రావణ పాత్రధారులు బాణాలతో యుద్ధం చేస్తున్నట్టు బాగా నటించారు. తర్వాత ఏమైందో కానీ ఇద్దరూ విల్లంబులు పక్కన పెట్టేసి ఒకరినొకరు తెగ కొట్టుకున్నారు. గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సేలంపూర్ గొన్సాయి గ్రామంలో ఈ నాటక ప్రదర్శన జరిగింది. నాటకం క్లమాక్స్‌లో రామ లక్ష్మణులు రావణుడితో యుద్ధం చేయసాగారు. ఒకరిపై ఒకరు బాణాలు విసురుకున్నారు. ఇంతలో రాముడి వేషధారుడిని రావణ పాత్రధారుడు స్టేజ్‌పై నుంచి కిందకు తోశాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ప్రేక్షకులలో కొందరు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరిని విడిపించారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. నాటక ప్రదర్శనను నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోచోట జరిగిన రామ్‌లీలా ప్రదర్శనలో రాముడు, హనుమంతుడు వేషం వేసిన వ్యక్తులు వేదికపై కొట్టుకున్నారు. రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయే సన్నివేశం ఉంటుంది కదా! నాటకంలో కూడా లక్ష్మణుడు మూర్ఛపోతాడు. తమ్ముడిని దగ్గరకు వచ్చిన రాముడి పాత్రధారుడిని హనుమంతుడి వేషధారుడు కాలితో తన్నాడు. అక్కడ గొడవ మొదలయ్యింది. అది పెరిగి చితక్కొట్టుకునే వరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.