స్టేషన్‌లోకి(Station) రైలు వస్తున్నది. ఫ్లాట్‌ఫామ్(Platform) మీద ఉన్న ప్రయాణికులు అలెర్టయ్యారు. ఇంతలోనే ఓ వృద్ధుడు పట్టాల మీద పడిపోయారు. అవతలివైపు ఫ్లాట్‌ఫామ్ నుంచి ఇది గమనించిన రైల్వే పోలీసులు(Railway Police) పరుగెత్తుకుంటూ వచ్చి, తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ వృద్దుడిని కాపాడాడు. సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతునన ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు ఆ రైల్వే పోలీసును మెచ్చుకుంటున్నారు.
స్టేషన్‌లోకి(Station) రైలు వస్తున్నది. ఫ్లాట్‌ఫామ్(Platform) మీద ఉన్న ప్రయాణికులు అలెర్టయ్యారు. ఇంతలోనే ఓ వృద్ధుడు పట్టాల మీద పడిపోయారు. అవతలివైపు ఫ్లాట్‌ఫామ్ నుంచి ఇది గమనించిన రైల్వే పోలీసులు(Railway Police) పరుగెత్తుకుంటూ వచ్చి, తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ వృద్దుడిని కాపాడాడు. సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతునన ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు ఆ రైల్వే పోలీసును మెచ్చుకుంటున్నారు. గుజరాత్‌లోని(Gujarat) వల్సాద్(Valsad) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో సూరత్(Surat)-బాంద్రా(Bandra) టెర్మినల్ ఇంటర్‌సిటీ రైలు వాపి స్టేషన్‌లోకి వస్తున్నది. రైలును గమనించని ఓ వృద్ధుడు పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో పట్టాల మధ్యలో పడిపోయాడు. స్వయంగా పైకి లేచే శక్తి అతడికి లేకపోయింది. ఓవైపు నుంచి రైలు వస్తుండటం, మరోవైపు వృద్దుడు పట్టాల మీద పడిపోవడం గమనించిన రైల్వే పోలీసు వీర్‌భాయ్(Veerbhai) ఫ్లాట్‌ఫామ్ నుంచి పట్టాల మీదకు దూకి పరుగెత్తుకుంటూ వృద్ధుడిని చేరుకున్నాడు. రైలు సమీపంలోకి వచ్చినా గాభరా పడకుండా ప్రాణాలను లేక్కచేయకుండా వృద్దుడిని కాపాడాడు. వీర్‌భాయ్కు మరికొంతమంది సాయం అందించారు.