కాంగ్రెస్‌(Congress) పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) సోషల్‌ మీడియాలో(Social Media) ట్రెండింగ్‌ అవుతున్నారు. బైక్‌ రిపేర్‌ షాపులలో మెకానిక్‌గా(Mechanic) మారిపోయిన రాహుల్‌గాంధీ వారితో ముచ్చటించారు. వారి సమస్యలు అడగి తెలుసుకున్నారు. మంగళవారం సాయంత్రం కరోల్‌బాగ్‌ మార్కెట్‌లోని బైక్‌ రిపేర్‌ షాపులకు రాహుల్‌గాంధీ వెళ్లారు. అక్కడ పనివారితో మాటలు కలిపారు. వారితో కలిసి బైక్‌ రిపేర్‌ చేస్తూ ముచ్చటించారు.

కాంగ్రెస్‌(Congress) పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) సోషల్‌ మీడియాలో(Social Media) ట్రెండింగ్‌ అవుతున్నారు. బైక్‌ రిపేర్‌ షాపులలో మెకానిక్‌గా(Mechanic) మారిపోయిన రాహుల్‌గాంధీ వారితో ముచ్చటించారు. వారి సమస్యలు అడగి తెలుసుకున్నారు. మంగళవారం సాయంత్రం కరోల్‌బాగ్‌ మార్కెట్‌లోని బైక్‌ రిపేర్‌ షాపులకు రాహుల్‌గాంధీ వెళ్లారు. అక్కడ పనివారితో మాటలు కలిపారు. వారితో కలిసి బైక్‌ రిపేర్‌ చేస్తూ ముచ్చటించారు. రాహుల్‌ వచ్చారని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. వారికి అభివాదం చేసి, దాదాపు రెండు గంటల పాటు అక్కడే గడిపారు రాహుల్‌. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో(Facebook) పోస్ట్‌ చేశారాయన. రెంచ్‌లను తిప్పే..

భారత్ చక్రాలను కదిలించే చేతుల నుండి నేర్చుకోవడం అంటూ క్యాప్షన్‌ పెట్టారు. భారత్‌ జోడో యాత్ర తర్వాత రాహుల్‌ ఇమేజ్‌ చాలా పెరిగింది. కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ కూడా పెరిగింది. రాహుల్‌గాంధీ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకోవడం బాగానే వర్కవుట్‌ అవుతోంది. ఇంతకు ముందు ట్రక్‌ డ్రైవర్‌ సమస్యలను ఇలాగే అడిగి తెలుసుకున్నారు. రెండు నెలల నుంచి హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను(Manipur) రాహుల్‌గాంధీ సందర్శించనున్నారు. ఈ నెల 29, 30 తేదీలలో ఆయన మణిపూర్‌ వెళతారని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. చురాచంద్‌పూర్, ఇంఫాల్‌ల్లోని సహాయక శిబిరాల్లో తలదాచుకున్న వారితో పాటు పలువురు సామాజిక కార్యకర్తలతో రాహుల్‌గాంధీ మాట్లాడతారు.

Updated On 28 Jun 2023 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story