స్టాట్యూ ఆఫ్ లిబర్టీ(Statue Of Liberty) ఎక్కడుందంటే? అమెరికాలోని(america) న్యూయార్క్(New York) సిటీలో అని జవాబిస్తాం కదా! పంజాబ్‌లో(Punjab) కూడా ఉందంటే నమ్ముతారా? మీకు నమ్మకం కలగకపోతే ఓసారి పంజాబ్‌కు వెళ్లి చూడండి.. మీరే ఒప్పుకుంటారు. పంజాబ్‌లో ఇళ్లు, భవనాల పై కప్పులపై రకరకాల ఆకృతుల్లో నిర్మాణాలు చేపడుతుంటారు. కొన్ని చోట్ల విగ్రహాలను కూఆ ఏర్పాటు చేస్తుంటారు.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ(Statue Of Liberty) ఎక్కడుందంటే? అమెరికాలోని(america) న్యూయార్క్(New York) సిటీలో అని జవాబిస్తాం కదా! పంజాబ్‌లో(Punjab) కూడా ఉందంటే నమ్ముతారా? మీకు నమ్మకం కలగకపోతే ఓసారి పంజాబ్‌కు వెళ్లి చూడండి.. మీరే ఒప్పుకుంటారు. పంజాబ్‌లో ఇళ్లు, భవనాల పై కప్పులపై రకరకాల ఆకృతుల్లో నిర్మాణాలు చేపడుతుంటారు. కొన్ని చోట్ల విగ్రహాలను కూఆ ఏర్పాటు చేస్తుంటారు. ఆ విధంగా పంజాబ్‌లోని ఓ భవనంపై స్టాట్యూ ఆఫ్ లిబర్టీని నిర్మిస్తున్నారు. అమెరికాలో ఉన్నంత ఎత్తు విగ్రహం కాకపోయినప్పటికీ చూసేందుకు మాత్రం అచ్చంగా అలాగే ఉంది. పంజాబ్‌లోని తర్న్ తరణ్‌లో(Tarn Taran) నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిపై కప్పుపై స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనాను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని చూసేందుకు స్థానికులే కాదు, చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్ఉన్నారు. విగ్రహాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు తలో రకంగా కామెంట్ చేస్తున్నారు. పంజాబ్‌లోని చాలా మంది ఇళ్లపై మంచి నీళ్ల ట్యాంకులు విమానాలు, ఎస్‌యూవీల ఆకారంలో ఉంటాయని, అలాంటిదే ఇది కావచ్చని అంటున్నారు. బహుశా అది మంచి నీళ్ల ట్యాంక్ అయి ఉంటుందని ఇంకొకరు చెప్పారు. నయగారా జలపాతాన్ని కూడా నిర్మిస్తే కెనడాను కూడా చూసి ఉండేది కదా అని మరికొందరు చెబుతున్నారు.