ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రా(Agra) ఎక్స్‌ప్రెస్‌పై పొగమంచు కారణంగా బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. డజనుకు పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో ట్రక్కుతో(Truck) పాటు కారులు(Car), బైకులు(Bikes) ధ్వంసమయ్యాయి. ఒకరు చనిపోయారు. చాలా మందికి గాయాలయయాయి. ప్రమాదం బారిన పడి కొందరు ఇబ్బంది పడుతుంటే వారిని రక్షించాల్సిందిపోయి జనం కోళ్ల మీద పడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రా(Agra) ఎక్స్‌ప్రెస్‌పై పొగమంచు కారణంగా బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. డజనుకు పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో ట్రక్కుతో(Truck) పాటు కారులు(Car), బైకులు(Bikes) ధ్వంసమయ్యాయి. ఒకరు చనిపోయారు. చాలా మందికి గాయాలయయాయి. ప్రమాదం బారిన పడి కొందరు ఇబ్బంది పడుతుంటే వారిని రక్షించాల్సిందిపోయి జనం కోళ్ల మీద పడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాలలో బ్రాయిలర్‌ కోళ్లను(Chicken) తరలిస్తున్న ట్రక్కు కూడ ఉంది. అక్కడ జరిగిన విధ్వంసం గురించి ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా ట్రక్కులో ఉన్న కోళ్ల కోసం ఎగబడ్డారు. కొళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్‌ అడ్డుకున్నా ప్రజలు అతడిని పక్కకు నెట్టేసి కోళ్లను ఎత్తుకెళ్లారు. దొరికినకాడికి దొరికినట్టుగా పట్టుకెళ్లారు. కొందరు పదుల కొద్ది కోళ్లను దొంగిలించుకుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social media) వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉంటే రెండున్నరలక్షల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్ర‌క్కు డ్రైవర్ సునీల్ కుమార్ వాపోతున్నాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Updated On 27 Dec 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story