తీసుకున్న అప్పు(Debt) తీర్చని ఓ టీనేజర్‌ను చితకబాదారు సీనియర్లు. అతడిని నానా హింసలు పెట్టారు. తీర్చాల్సిన బాకీ కంటే చాలా రెట్ల డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. తాను అంత ఇవ్వలేనని బతిమాలుకున్నా వినలేదు. దాంతో ఆ యువకుడిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) ఎటావాకు చెందిన ఆ టీనేజర్‌ నీట్‌(Neet) కోచింగ్‌ కోసం కాన్పూర్‌ వచ్చాడు.

తీసుకున్న అప్పు(Debt) తీర్చని ఓ టీనేజర్‌ను చితకబాదారు సీనియర్లు. అతడిని నానా హింసలు పెట్టారు. తీర్చాల్సిన బాకీ కంటే చాలా రెట్ల డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. తాను అంత ఇవ్వలేనని బతిమాలుకున్నా వినలేదు. దాంతో ఆ యువకుడిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) ఎటావాకు చెందిన ఆ టీనేజర్‌ నీట్‌(Neet) కోచింగ్‌ కోసం కాన్పూర్‌ వచ్చాడు. కోచింగ్‌ సెంటర్‌లో సీనియర్లతో ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది. కొన్ని రోజులయ్యాక వారు ఉంటున్న ప్లాట్‌కు మకారం మార్చాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వారి దగ్గర 20 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. బెట్టింగ్‌లో(Betting) మొత్తం పోగొట్టుకున్నాడు. సీనియర్లు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలంటూ వేధించారు. 20 వేల రూపాయలకు బదులుగా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించారు. ఇవ్వకపోయే సరికి చిత్రహింసలకు గురి చేశారు. కిందపడేసి చితకబాదారు. కాళ్లు మొక్కుతున్నా వినలేదు. బలవంతంగా అతడి దుస్తులు విప్పించారు. మర్మాంగానికి ఇటుకను కట్టారు. అక్కడితో వారి దాష్టికాలు ఆగలేదు. అతడి వెంట్రుకలను కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు సీనియర్లు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని ఏడ్చాడా యువకుడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను స్టేషన్‌కు పిలిపించి మందలించి వదిలేశారు. అయితే టీనేజర్‌ను వేధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియో చూసి పోలీసులు సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు. వీడియోలో ఉన్న ఆరుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి కోచింగ్‌ సెంటర్‌కు వచ్చే విద్యార్థులను టార్గెట్‌ చేసుకుంటారని పోలీసులు అంటున్నారు.

Updated On 8 May 2024 4:04 AM GMT
Ehatv

Ehatv

Next Story