నీరజ్‌ చోప్రా, మను బాకర్ మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌...!

ఒలింపిక్స్‌లో(Olympics) భారత కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన భారత అథ్లెట్లు నీరజ్‌ చోప్రా(Neeraj chopra), మను బాకర్‌(Manu basker)! జావెలిన్‌ త్రోలో వరుసగా రెండు ఒలింపిక్‌ పతకాలను సాధించాడు నీరజ్‌.. లాస్ట్‌ టైమ్‌ స్వర్ణం సాధిస్తే, ఈసారి రజతం గెల్చుకున్నాడు. అలాగే ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు షూటర్‌ మను బాకర్‌. సోమవారం పారిస్‌ ఒలింపిక్స్‌(Olympics) సందర్భంగా వీరిద్దరు సన్నిహితంగా మెలగడం హాట్‌ టాపిక్‌గా మారింది. వీళ్లిద్దరూ ముచ్చటించుకుంటున్న సమయంలో కెమెరాలన్నీ అటువైపు తిరిగిపోయాయి. ఇద్దరూ సిగ్గుపడుతూ మాట్లాడుకుంటున్నట్టుగా ఈ దృశ్యం చూసిన వారికి అనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social media) చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు మను బాకర్‌ తల్లి నీరజ్‌తో మాట్లాడడం.. తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లుగా కనిపించడంతో నెటిజన్లు తలో రకంగా ఆలోచిస్తున్నారు. మను బాకర్‌తో నీరజ్‌ చోప్రా ప్రేమలో ఉన్నాడని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు రాసాగాయి. తమ కూతురును పెళ్లి చేసుకోవాలని నీరజ్‌ను మను బాకర్‌ తల్లి కోరిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. వాళ్ల మధ్య జరిగింది ఏమిటన్న దానిపై క్లారిటీ అయితే లేదు.

Eha Tv

Eha Tv

Next Story