ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) అలీగఢ్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) అలీగఢ్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఆస్తి గొడవలలో పోలీస్‌స్టేషన్‌కు(Police station) వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ కనిపెంచిన తల్లికి నిప్పంటించాడు(Brun). వెంటనే రియాక్టయిన పోలీసులు మంటలను ఆర్పి ఆమెను కాపాడేందుకు ప్రయత్నిచారు. ఆగమేఘాల మీద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయలో భూ తగాదాలతో ఓ కుటుంబం ఖైర్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చింది. ఓ మహిళ, ఆమె కొడుకు ఓ పక్కకు వెళ్లారు. ఆ మహిళ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. లైటర్‌తో నిప్పంటించుకుంటానంటూ బెదిరించింది. పోలీసులు వెళ్లి ఆమె చేతిలో ఉన్న లైటర్‌ను లాగేసుకుంటున్నప్పుడు అది కిందపడింది. అప్పటి వరకు మొబైల్‌లో వీడియో రికార్డు చేస్తున్న ఆమె కొడుకు కింద పడిన లైటర్‌ను తీసుకుని తన తల్లికి నిప్పంటించాడు. మంటల్లో ఆమె కాలిపోతుండటాన్ని మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేశాడు. కొడుకు చేసిన పనికి పోలీసులు నిర్ఘాంతపోయారు. మంటల్లో కాలిపోతున్న ఆ మహిళను కాపాడేందుకు ప్రయత్నించారు. గోనె సంచులు కప్పి, మట్టి చల్లి మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే ఆమెకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలిని హేమలతగా గుర్తించారు. తల్లికి నిప్పంటించిన ఆమె కుమారుడు గౌరవ్‌ (22)ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Eha Tv

Eha Tv

Next Story