సోషల్ మీడియాలో(social Media) పాపులరవ్వడానికి ఏదేదో చేస్తున్నారు.
సోషల్ మీడియాలో(social Media) పాపులరవ్వడానికి ఏదేదో చేస్తున్నారు. వ్యూస్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు. దిక్కుమాలిన రీల్స్(Reels) చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) తౌబా-తౌబా ట్రెండ్(Tauba trend) నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో వ్యూస్ కోసం స్పెషల్‌గా డాన్స్‌లు గట్రాలు చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఓ అమ్మాయి ఇలాగే రోడ్డుమీద రీలు చేస్తుంటే వచ్చిపోయేవారు వింతగా చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి పేరు తనుమితా(thanumitha) ఘోషా. మైంత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్. వీటితో పాటు సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా! తౌబా-తౌబాట్రెండ్‌పై రీల్ చేయడం కోసం ముంబాయి వీధుల్లో తిరిగింది. అదికూడా టవల్‌తో(Towel)! శరీరంలో సగానికి పింక్ కలర్ టవల్ చుట్టుకుని, తలపై తడి జుట్టును మరో టవల్‌తో కవర్ చేస్తూ రోడ్డు మీదకు వచ్చింది. ఆమెను చూస్తే బాత్‌రూమ్ నుంచి డైరెక్ట్‌గా రోడ్డు మీదకు వచ్చినట్టు కనిపించింది. రోడ్డు మీద వెళుతున్నవారికి ఆమె తనుమిత ఘోష్ అని తెలియదు. అందుకే వింతగా చూశారు. అలా నడుస్తూ నడుస్తూ కాసేపటికి శరీరంపై వేసుకున్న టవల్‌ను తీసేసింది. లోపల్ డ్రస్ వేసుకుని ఉంది. ఇప్పుడీ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోను పదిలక్షల మందికిపైగా చూశారు.