కేరళలోని(Kerala) తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయంలోకి(Padmanabhaswamy temple) అన్య మతస్తులకు ప్రవేశం లేదు.
కేరళలోని(Kerala) తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయంలోకి(Padmanabhaswamy temple) అన్య మతస్తులకు ప్రవేశం లేదు. అలాంటిది ఓ విదేశీ మహిళను ఎలా రానిస్తారు? రానివ్వరు కదా! ఆమె పద్మనాభస్వామి దర్శనం కోసం వస్తే లోపలికి వెళ్లనివ్వలేదు. భారతీయులకు(Indian) మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను తలుపు దగ్గరే ఆపేశారు. తన భర్త భారతీయుడేనని, తమకు నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పినా ఆలయ అధికారులు వినిపించుకోలేదు. ఓ విదేశీ మహిళ భారతీయ మహిళలాగే చక్కగా చీర కట్టుకుని తనకు కాబోయే భర్తతో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. కేవలం తన జాతీయత, మతం కారణంగా ఆలయంలోకి రానివ్వలేదని ఆమె వాపోయారు. కేవలం భారతీయులకు మాత్రమే ఆలయ అనుమతి ఉంటుందని అధికారులు తనతో చెప్పారంటూ ఆమె వీడియోలో తెలిపారు. ఆమెతో తనకు నిశ్చితార్థం జరిగిందంటూ భారతీయుడు అయిన ఆమె ప్రియుడు ఎంత చెబుతున్నా ఆలయ సిబ్బంది పట్టించుకోలేదు. తాను కూడా హిందువునేనని ఆ మహిళ చెప్పుకున్నా సర్టిఫికేట్ చూపించాలని అడిగారని ఆ మహిళ తెలిపారు. గుళ్లకు వెళ్లే ప్రతీసారి సర్టిఫికెట్ తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తాను ఇండియన్‌ను పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదవుతానని, అయినా ఆలయ సిబ్బంది తనను ఓ నేరస్థురాలిగా చూశారని తన వీడియోలో ఆమె ఆరోపించారు. ఆలయ అధికారులు వర్ణ వివక్షను ప్రదర్శించారని ఆవేదన చెందారు. ఆలయంలో ప్రవేశించేందుకు తాను చీరను కూడా కొన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ప్రార్ధన స్థలానికి వెళ్లి పూజలు చేయాలనుకున్న వ్యక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారు అని కార్తీ ప్రశ్నించారు. మరోవైపు అనుకమంది ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆలయాల్లోకి విదేశీయులను అనుమతిస్తే తప్పేమిటని అంటుంటే . మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని అంటున్నారు.