అత్తలపై కోడళ్ల దాడులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అత్తల పట్ల మానవత్వం లేకుండా పైశాచికత్వంగా ప్రవర్తిస్తున్నారు. శేషజీవితం హాయిగా గడపాలనుకునేవారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ కోడలు అత్తను చితకబాదుతున్న ఘటన కేరళలో(Kerala) చోటుచేసుకుంది. కేరళలోని కొల్లాంలో(Kollam) 80 ఏళ్ల ఏలియమ్మని(Eliamma) ఆమె కోడలు మంజుమోల్(Manjumol) (42) దారుణంగా కొట్టింది.

Manjumol Abuse Mother in law
అత్తలపై కోడళ్ల దాడులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అత్తల పట్ల మానవత్వం లేకుండా పైశాచికత్వంగా ప్రవర్తిస్తున్నారు. శేషజీవితం హాయిగా గడపాలనుకునేవారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ కోడలు అత్తను చితకబాదుతున్న ఘటన కేరళలో(Kerala) చోటుచేసుకుంది. కేరళలోని కొల్లాంలో(Kollam) 80 ఏళ్ల ఏలియమ్మని(Eliamma) ఆమె కోడలు మంజుమోల్(Manjumol) (42) దారుణంగా కొట్టింది. అత్త ఏలియమ్మ మంచం మీద కూర్చొని టీవీ చూసేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడ ఉన్న కోడలు మంచంపై నుంచి లేచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అత్త ఏలియమ్మ కోడలు మాట వినిపించుకోకుండా టీవీ చూస్తుండడంతో ఆమె పట్ల నిర్దయగా ప్రవర్తించిన కోడలు.. ఆమెను ఒక్కసారిగా తోసింది. దీంతో ఏలియమ్మ బొక్కబోర్లా పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో కోడలు మంజుమోల్‌ను పోలీసులు అరెస్ట్(Police arrest) చేశారు.
