సోషల్‌ మీడియా(Social media) కోసం రీల్స్‌(Reels) చేస్తున్న మహిళకు బైక్‌పై వచ్చిన వ్యక్తి షాక్‌ ఇచ్చాడు. ఆమె మెడలోని మంగళసూత్రం(Chain) గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. ఢిల్లీ(Delhi) శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఘజియాబాద్ జిల్లాలో ఈ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది.

సోషల్‌ మీడియా(Social media) కోసం రీల్స్‌(Reels) చేస్తున్న మహిళకు బైక్‌పై వచ్చిన వ్యక్తి షాక్‌ ఇచ్చాడు. ఆమె మెడలోని మంగళసూత్రం(Chain) గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. ఢిల్లీ(Delhi) శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఘజియాబాద్ జిల్లాలో ఈ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. ఇందిరాపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళ మంచిగా రెడీ అయ్యి రీల్‌ కోసం వీధిలో వయ్యారంగా నడుస్తుండగా అదే టైంకు చైన్‌ స్నాచర్‌(Chain Snatcher) అటుగా వచ్చాడు. ఇదే అవకాశంగా భావించిన ఒక వ్యక్తి బైక్‌పై ఆ మహిళ వద్దకు చేరుకున్నాడు. ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. చైన్‌ స్నాచర్‌ను అడ్డుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక చైన్‌ స్నాచింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు మహిళ. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా నిందితుడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఆ మహిళ చేస్తున్న రీల్‌ వీడియో రికార్డ్ కావడంతో సామాజిక మాధ్యమాల్లో ఇది చక్కర్లు కొడుతోంది.

Updated On 26 March 2024 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story