ముంబాయిలోని(Mumbai) అటల్ సేతు బ్రిడ్జిపై(Atal Setu bridge) ఓ మహిళ ఆత్మహత్యకు(suicide) ప్రయత్నించింది.
ముంబాయిలోని(Mumbai) అటల్ సేతు బ్రిడ్జిపై(Atal Setu bridge) ఓ మహిళ ఆత్మహత్యకు(suicide) ప్రయత్నించింది. అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్(Cab driver) సమయస్ఫూర్తితో, చురుకుగా వ్యవహరించి ఆమెను కాపాడాడు. సమయానికి పోలీసులు కూడా రావడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ముంబాయి పోలీసులు(Mumbai police) ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముంబాయిలోని ములుంద్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల రీమా ముకేశ్ అటల్ సేతు బ్రిడ్జ్‌కు చెందిన సేఫ్టీ బారియర్‌పై కూర్చొని ఉంది. మొదట ఆమె సముద్రంలో ఏవో వస్తువులను విసిరేసింది. తర్వాత ఆమె కూడా అందులో దూకబోయింది. పక్కను ఉన్న క్యాబ్ డ్రైవర్ అది పసిగట్టాడు. వెంటనే ఆమె జట్టును, చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దగ్గరలోనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చారు. ఆమెను రక్షించారు. డ్రైవర్ సమయానికి రియాక్టవ్వడం, పోలీసులు తక్షణమే స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియోను షేర్ చేసిన పోలీసులు ఎంతో విలువైన జీవితాన్ని ఇలాంటి చర్యలతో ముగించుకోవద్దని సూచించారు. లాస్ట్ మంత్ కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అటల్ సేతు బ్రిడ్జిపై కారు ఆపిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తర్వాత వంతెన రైలింగ్‌పైకి ఎక్కి సముద్రంలోకి దూకేశాడు. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఆ పని చేసి ఉంటాడని వార్తలు వచ్చాయి.