కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, కన్నూర్ ఎంపీ కె. సుధాకరన్‌ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణలకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, కన్నూర్ ఎంపీ కె. సుధాకరన్‌ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణలకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కన్నూర్‌లోని సుధాకరన్ నివాసంలో కొందరు వ్యక్తులు చేతబడికి సంబంధించిన పాతిపెట్టిన వస్తువులను బయటకు తీస్తున్నారు.

అయితే ఈ వీడియోపై కేపీసీసీ అధ్యక్షుడి క్లారిటీ కూడా వచ్చింది. ఇది పాత వీడియో అని.. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పాతిపెట్టిన వస్తువులను బయటకు తీసినప్పుడు మీరు సంఘటనా స్థలంలో ఉన్నారా అని KPCC అధ్యక్షుడు సుధాకరన్‌ను ప్రశ్నించగా.. 'మీరు ఉన్నితాన్ నుండి పూర్తి సమాచారం పొందవచ్చు. ఇలాంటి బెదిరింపుల వల్ల నాకు ఎలాంటి తేడా ఉండదన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇలాంటి విషయాలు ఏంట‌ని జర్నలిస్టులు ప్రశ్నించగా.. సుధాకరన్ దాని గురించి తాను కూడా విన్నట్లు చెప్పారు. అయితే ఆ వీడియోపై ఉన్నితన్ స్పందించలేదు.

వీడియోలో మూడో వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి జ్యోతిష్కుడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి కొన్ని విగ్రహాలు, బూడిద, రంగు పొడులను బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపించింది. వీటిని చేతబడికి ఉపయోగించినట్లు ఆరోపణ‌లు వ‌చ్చాయి. ఆ మెటీరియల్ అంతా చేతబడి కోసం అని ఒక వ్యక్తి గొంతు వినిపించింది. ఇది మీ తల తిప్పేలా చేస్తుందని అంటున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే ప‌లువురు స్నందించారు.

ఈ ఆధునిక వైజ్ఞానిక యుగంలో మూఢనమ్మకాలను, చేతబడిని నమ్మి అనుసరించే వారు పిరికివాళ్లని కాంగ్రెస్ సిద్ధాంతకర్త చెరియన్ ఫిలిప్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కేరళ సమాజంలోని ప్రజలు మూఢనమ్మకాలను, చెడు పద్ధతులను తిరస్కరించారని అన్నారు. ఇప్పటికీ చేతబడి, ఇతర అక్రమాలకు పాల్పడే వారు నేరస్థులు మాత్రమేన‌న్నారు.

Eha Tv

Eha Tv

Next Story