☰
✕
కాటికి కాళ్లు జాపుకునే వయసులో కోరికలు ఉండకూడదా ఏమిటి?
x
కాటికి కాళ్లు జాపుకునే వయసులో కోరికలు ఉండకూడదా ఏమిటి? రేపో మాపో బాల్చి తన్నేయడానికి సిద్ధంగా ఉన్నవారికి కూడా పెళ్లి(Marriage) మీద మనసుపోవచ్చు. తప్పేం లేదు. ఇలాగే లేటు వయసులో ఓ తాతగారు పెళ్లి పీటలెక్కారు. ఆ పెళ్లి కొడుక్కి ఎంత లేదన్నా 90 ఏళ్ల వయసుంటుంది. ఆ ముత్తాతగారు ఓ 18 ఏళ్ల అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి మూములుగా జరగలేదు. ఆకాశమంద పందిరి వేసి, భూదేవి అంత పీట వేసి అని చెబుతుంటారే! అంత గ్రాండ్‌గా జరిగింది. అంతేనా డీజేకు(DJ) తగినట్టుగా పెళ్లి కూతురుతో పెళ్లికొడుకు డాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో(Video) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకరైతే వీడియో చూస్తూ విషం తాగి చచ్చిపోవాలని ఉందంటూ కామెంట్ చేశాడు.
Eha Tv
Next Story